10న కేరాఫ్ సూర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సందీప్‌కిషన్, మెహరీన్ జంటగా సుశీంద్రన్ దర్శకత్వంలో లక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘కేరాఫ్ సూర్య’. ఈ చిత్రం ఈనెల 10న విడుదలకు సిద్ధమైంది. సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో నిర్వహించారు. ఈ సినిమా గురించి దర్శకుడు సుశీంద్రన్ మాట్లాడుతూ- తెలుగులో తాను తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ సినిమా సందీప్ కిషన్ కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా నిలుస్తుందని, తమిళంలో ధనుష్‌కు ‘పొల్లా దవన్’ చిత్రంతో ఎంత బ్రేక్ వచ్చిందో అంత క్రేజ్ సందీప్‌కు ఈ చిత్రంతో వస్తుందని తెలిపారు. ఈ సినిమా తప్పక హిట్ అవుతుందన్న నమ్మకం వుందని సుశీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన నా పేరు శివ నచ్చిందని, ముఖ్య అతిథిగా విచ్చేసిన సాయిధరమ్‌తేజ్ అన్నారు. ఈ చిత్రాన్ని రెండు భాషల్లో 59 రోజుల్లోనే పూర్తిచేశామని, డబ్బింగ్ సినిమా అన్న జాడలు ఎక్కడా కనపడవని, 100 శాతం బైలింగ్వల్ మూవీగా రూపొందించిన ఈ సినిమా అందరికీ నచ్చుతుందని, ఈనెల 10న థియేటర్‌లకు వస్తున్నామని సందీప్‌కిషన్ తెలిపారు. కార్యక్రమంలో చక్రి చిగురుపాటి, నిర్మాత రాజేష్, అనీల్ రావిపూడి, చోట కె నాయుడు, హరీశ్ ఉత్తమన్ తదితరులు పాల్గొని విశేషాలు తెలిపారు.