డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త దర్శకులతో సరికొత్త కథనాలతో సినిమాలు చేయడానికి నేను ఆసక్తి చూపుతున్నానని నటుడు మంచు మనోజ్ తెలియజేస్తున్నారు. తాజాగా ఆయన నటించిన ‘ఒక్కడు మిగిలాడు’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. అజయ్ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈనెల 10న వస్తోంది. ఈ చిత్రం గురించి మంచు మనోజ్ పలు విశేషాలు తెలిపారు.
* ఆ ఒక్కడి గురించి..?
- చాలామంచి కథ. నా మనసుకు నచ్చిన సినిమా. 2017లో సూర్యగాను, 1990కి ముందు పీటర్‌గానూ రెండు పాత్రల్లో కనిపిస్తా. సినిమాలో ఎక్కడా ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఉండదు. పూర్తిగా కానె్సప్ట్ బేస్డ్ చిత్రంగా రూపొందించారు.
* ఇలాంటి కథను ఎంచుకోవడంలో..?
- గోపీమోహన్ ద్వారా ఈ కథ అజయ్ చెప్పాడు. ఒక వర్గానికి దేవుడైన వ్యక్తి కథ ఇది. దర్శకుడి పరిశోధన, రాసుకొన్న నోట్స్ నన్ను మెప్పించాయి. తొలి భాగంలోనే యుద్ధ సన్నివేశాలు ఉంటాయి. అక్కడే ఆసక్తికర పరిణామాలు ఉంటాయి. రెండో భాగంలో 40 నిమిషాలపాటు నేను లేకపోయినా థ్రిల్లింగ్‌గా సినిమా రూపొందించాడు. మనసు బరువెక్కే సన్నివేశాలు ఉన్నాయి. నేను మరో నలుగురు తప్ప అంతా కొత్తవాళ్ళే నటించారు.
* కష్టపడ్డారా?
- చాలా. ప్రతిరోజూ పడుకుంటే యుద్ధాలే కలలోకి వచ్చేవి. అదేంటో ప్రతి యుద్ధంలోనూ ఫ్యామిలీని కాపాడుకుంటూ వున్నట్టే అనిపించింది.
* ఎల్‌టిటిఈ నాయకుడి కథా?
- అవును. అయితే ఇది ఆయన కథ అని చెప్పడంలేదు. హక్కుల కోసం పోరాడిన ఓ నాయకుడి కథగా చెబుతున్నాం. ఇప్పుడు ఎవరో ఒకటి రెండు చోట్ల బాంబులు వేస్తే, మనం ఇలా మాట్లాడం. ఎందుకంటే మనకు కులాలు, పెద్దా చిన్నా అనేవి గుర్తుకురావు. అలాంటిది ఓ సమాజం కోసం పోరాడిన వ్యక్తి జీవితాన్ని చూసి స్ఫూర్తిపొందనివాళ్ళు అరుదుగా వుంటారేమో అన్న ఆలోచనతో ఈ సినిమా చేశాం. నాకు తెలిసిన చాలామంది ఇళ్ళల్లో పూజ గదుల్లో ఆయన ఫొటో ఉంది.
* సెన్సార్ ఇబ్బందులేమైనా..?
- చుక్కలు చూపించారు. మా సినిమా అంత హార్డ్‌గా వుంటుంది మరి. అప్పటికీ జరిగిన విషయాలే అయినా, వాటి తీవ్రతను మేం కొంచెం కూడా చూపించలేదనేది వాస్తవం.
* ఆమధ్య సినిమాలు చేయనన్నారు?
- జనాల్లోకి రావాలని వుంది. వారి మధ్య వుండి వారి సమస్యలకు కావలసిన జవాబులను వెతకాలని వుంది.
* రాజకీయాల్లోకి వస్తారా?
- అలా అని కాదు. ఏదో ఓ పక్కనుండి సహకారం అందించాలని వుంది. ఆమాటే ఇంట్లో వారితో అంటే, అందరూ తిట్టి మర్యాదగా సినిమాలు చేయమన్నారు. అందుకే ఆ పని మానుకున్నా.
* కమల్‌హాసన్ ఎంట్రీ?
- ఆయన ముఖ్యమంత్రి అయితే చూడాలని వుంది.
* తదుపరి చిత్రాలు?
- ప్రస్తుతం ఒక్కడు మిగిలాడు ప్రభావం నుండి ఇంకా బయటపడలేదు. ఓ ఆరు నెలలు గ్యాప్ తీసుకుని ఓ మంచి లవ్‌స్టోరీ చేయాలని వుంది. అజయ్ శాస్ర్తీ అనే దర్శకుడు శ్రవణ్‌తో కలిసి ఓ మంచి కథ వినిపించారు. చంద్ర అనే కొత్త దర్శకుడితో ఆ సినిమా చేస్తాను.

- శ్రీ