నటిగా నిరూపించుకోవాలని..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి పాత్రల్లో నటించి ప్రేక్షకులను రంజింపజేసి మంచి నటిగా నిరూపించుకోవాలని వుంది అని ‘లవర్స్ క్లబ్’ కథానాయిక పావని తెలిపారు. శ్రీయా ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై అనీష్, పావని జంటగా ధృవశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 17న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా కథానాయిక పావని చిత్ర విశేషాలు తెలిపారు. ఈ చిత్రంలో నేను గీత అనే అమ్మాయిగా నటించా. మెడికల్ స్టూడెంట్ పాత్ర. ఈ కాలం అమ్మాయి ఎలా వుంటుందో అలా వుంటుంది. తన మనసులో ఏది ఉంచుకోదు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడేసే బోల్డ్ పాత్ర. మోడరన్ అమ్మయిగా సిగరెట్ తాగడం లాంటివి కూడా ఈ చిత్రంలో చేశా. తనకు ఇంట్లో వచ్చిన ఓ సమస్యవల్ల బైటికి వెళ్లిపోయిన ఆమెకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఆమె జీవితంలోకి లవర్స్ క్లబ్ ఎందుకు వచ్చింది అన్న కథనంతో ఈ చిత్రం సాగుతుంది. బాలనటిగా గంగ చిత్రంలో 2004లో నటించా. గుంటూరు నుండి వచ్చిన నేను ఇప్పటికే ఎర్రబస్సు, అంపశయ్య, లావణ్య విత్ లవ్‌బాయ్స్ చిత్రాల్లో నటించా. ఈ సినిమాలో చేసిన గీత పాత్రకు మంచి గుర్తింపు వస్తుందన్న నమ్మకం వుంది. ఈ చిత్రాన్ని ఐ ఫోన్ 6లో షూటింగ్ చేశారు. ఈ సినిమా కోసం మొదట కలిసినపుడు ఫోన్‌లో చిత్రీకరిస్తున్నాము అంటే కొంత టెన్షన్ ఎదుర్కొన్నా. అసలు ఇది జరిగే పనేనా అనుకున్నా. కానీ దర్శకుడు చెప్పిన విషయాలు విని నమ్మకం కలిగింది. సినిమా వైవిధ్యంగా వచ్చింది. దర్శకుడి కమిట్‌మెంట్‌తో మంచి చిత్రం చేశా. హీరో అనీష్ ఇతర నటీనటులంతా సరదా సరదాగా సినిమా పూర్తిచేశారు. ఈ సినిమా తరువాత మరో స్క్రిప్ట్ సిద్ధంగా వుంది. నన్ను నేను నిరూపించుకునే పాత్రలకోసం ఎదురుచూస్తున్నాను అంటూ ముగించారు.