రోడ్డుమీద దయ్యం డబ్బింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భరణి కుమార్, అంజలి, విష్ణు, శిరీష, భాగ్యరాజ్ ముఖ్యపాత్రల్లో హెచ్.వేణుగోపాల్ దర్శకత్వంలో ఎన్.పద్మ సమర్పణలో శ్రీ శివాంబిక సాయి మూవీ ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కుతున్న హరర్ ఎంటర్‌టైనర్ ‘రోడ్డుమీద దయ్యం’. ఇటీవలే షూటింగ్‌తోపాటు డబ్బింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలవుతున్న సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత వేణుగోపాల్ వివరాలు తెలియజేస్తూ, హారర్ సస్పెన్స్ అంశాలతో తెరకెక్కిన సినిమా ఇది. ఇటీవలే కేరళలో షూటింగ్ పూర్తిచేశామని, అమరావతిలో క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించామని, సరికొత్త కథ, కథనంతో తెరకెక్కుతున్న సినిమా ఇదన్నారు. అందరికీ నచ్చే అన్ని రకాల కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే డబ్బింగ్ పూర్తిచేసుకుందని, మిగతా కార్యక్రమాలు, సెన్సార్ త్వరలోనే పూర్తిచేసి చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రానికి సమర్పణ:ఎన్.పద్మ, నిర్మాత, దర్శకత్వం:హెచ్.వేణుగోపాల్.