సవ్యసాచి మొదలు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘సవ్యసాచి’. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. మాధవన్ ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం గూర్చి నిర్మాతలు వై.నవీన్, వై.రవిశంకర్ మోహన్ మాట్లాడుతూ- చిలుకూరి బాలాజీ దేవాలయం దగ్గరలో రూపొందించిన సెట్‌లో ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించామని, నాగచైతన్య, నిధి అగర్వాల్, వెనె్నల కిశోర్, సత్యాల కాంబినేషన్‌లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నామని తెలిపారు. 15 రోజులపాటు ఈ షెడ్యూల్ చేస్తామని, డిసెంబర్‌లో మరో షెడ్యూల్‌లో మాధవన్ సన్నివేశాలు షూటింగ్ చేస్తామని తెలిపారు. హీరో పాత్రను దర్శకుడు సవ్యసాచి అనే పేరుకు తగిన విధంగా డిజైన్ చేశారని, హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుందని వారు తెలిపారు. రావు రమేష్, తా.రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, కెమెరా: యువరాజ్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చందూ మొండేటి.