కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ టీజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కిరణ్, హర్షదా కులకర్ణి ప్రధాన తారాగణంగా ధృవ ప్రొడక్షన్స్ పతాకంపై కార్తీక్ మేడికొండ దర్శకత్వంలో సుజన్ రూపొందించిన చిత్రం ‘కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, పోస్టర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు కార్తీక్ మాట్లాడుతూ- డిఫరెంట్ జోనర్‌లో ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్ అందించేలా రూపొందించామని, కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను ప్రేక్షకులు చూస్తారని తెలిపారు. సినిమాలో అనేక వైవిధ్యమైన కోణాలుంటాయని, తమ స్నేహితులందరూ కలిసి ఈ చిత్రాన్ని సరికొత్త జోనర్‌లో రూపొందించే ప్రయత్నం చేశామని తెలిపారు. టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతాయని, టెక్నికల్‌గా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి ప్రయత్నించామని నిర్మాత సుజన్ తెలిపారు. తమ్మారెడ్డి, రాజ్ కందుకూరి, రాఘవేంద్ర, సంగీత దర్శకుడు ఘంటసాల విశ్వనాధ్, సాంబశివరావు, గాయత్రి గుప్తా పాల్గొని విశేషాలు తెలిపారు.