విలన్‌గా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాంగ్రీ యంగ్‌మెన్‌గా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హీరో రాజశేఖర్‌కు ఈమధ్య సినిమాలు తగ్గిపోయాయి. గత ఏడాది ‘గడ్డం గ్యాంగ్’ సినిమా చేసినా అది అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇప్పటికే ఆయన నటించిన ‘పట్టపగలు’ చిత్రం విడుదలకు సిద్ధంగా వుంది. దాదాపు ఏడాది కాలంగా ముఖానికి రంగేసుకోని రాజశేఖర్ ఇపుడు విలన్ పాత్రలో నటించేందుకు సిద్ధమయ్యాడు. కెరీర్ మొదట్లో నెగెటివ్ పాత్రలతోనే ఆకట్టుకున్న రాజశేఖర్ హీరోగా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన పూర్తి స్థాయిలో విలన్‌గా నటించనున్నాడని, ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుందని తెలిసింది. ఈ స్క్రిప్ట్ నచ్చడంతో ఈ సినిమాలో ఈ పాత్ర చేయడానికి రాజశేఖర్ ఓకె చెప్పినట్టు తెలిసింది. ఆయనకు జోడీగా ఓ టాప్ హీరోయిన్ కూడా నటించనుంది. ‘అహం’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. త్వరలోనే మరిన్ని అధికారిక వివరాలు వెల్లడి కానున్నాయి.