అక్షర

అపురూప సౌందర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉషోదయ కిరణాల కాంతిలో
మెరిసిన ఓ మంచుముత్యమా
మేలిమి బంగారు సైతం మెరవనంటుంది
నీ ముద్దులొలికే అపురూప
సౌందర్య లావణ్యాన్ని చూసి!
గానరంజనివా
గమకప్రియ రాగానివా
గంధర్వ సుందరివా
వసంతకాలపు కోయిలమ్మ సైతం
మూగబోతానంటుంది
నీవు ఆలపిస్తున్న నవరాగమాలికల
గానామృతం విని!
కుందనపు అపరంజి బొమ్మవా
పురివిప్పిన మయూరివా
వికసించిన పుష్పాలు సైతం
పరిమళించమంటున్నాయి
నీ సొగసిరి సోయగాల
నులివెచ్చని స్పర్శ కలిగేవరకు
నీ ప్రేమ బంధనాలయంలో బంధించిన
నా హృదయ బంధానివా
నా మనో బలహీనతల భావాల బలానివా
నను ఎడబాయని నా ఆత్మబంధువా
రాతిశిలనై యున్న నాలో ఆరోప్రాణమై
ఆ బ్రహ్మరాసిన నా నుదుట గీతలో
ఆయువుగీతికవై
నా జీవిత చరమాంకం వరకు తోడుగా
నా చేయి విడువక నా ప్రతిరూపానివై
నిలిచిపోవా ప్రియ నేస్తమా!

- డా. శారదారెడ్డి వకుల