రీమిక్స్ ఇష్టం లేదు - సంగీత దర్శకుడు డి.జె.వసంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ సీనియర్ సంగీత దర్శకుడు సత్యం మనవడిగా తెలుగు తెరకు పరిచయమై తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు డి.జె.వసంత్. తాజాగా ఆయన సంగీత దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పీడున్నోడు’. బెల్లంకొండ శ్రీనివాస్, సోనారిక జంటగా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతున్న సందర్భంగా సంగీత దర్శకుడు వసంత్‌తో ఇంటర్వ్యూ...
* రెస్పాన్స్ ఎలా వుంది?
- చాలా ఆనందంగా వుంది. ‘సుడిగాడు’ సినిమా తరువాత భీమనేనితో పనిచేయడం, అలాగే ఈ సినిమాకు కూడా మంచి మ్యూజికల్ హిట్ రావడంతో నాకు మంచి బ్రేక్‌నిచ్చింది.
* ఈ సినిమా కోసం ఎలాంటి హోంవర్క్ చేశారు?
- దాదాపు రెండు సంవత్సరాలుగా భీమనేనితో ట్రావెల్ చేస్తున్నాను. ఆయనకు మ్యూజికల్ హిట్స్ ఎక్కువగా వుండడంతో ప్రతి పాట మీదా చాలా శ్రద్ధ తీసుకుంటారు. ఈ సినిమా కోసం దాదాపు 50 ట్యూన్స్ చేశాం. ఫైనల్‌గా 15 పాటల్ని రికార్డు చేశాం. అందులో 8 పాటలను సినిమా కోసం వాడాము. రచయితలందరూ మంచి లిరిక్స్ అందించారు.
* మీ నేపథ్యం?
- మా తాతగారు సంగీత దర్శకుడు సత్యం. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 650కిపైగా సినిమాలు చేశారు. నేను పుట్టి పెరిగిందంతా విజయనగరంలోనే. అక్కడే వయొలిన్‌లో డిప్లొమా నేర్చుకున్నాను. చెన్నైలో కీబోర్డు నేర్చుకున్నాను. ఆ తరువాత హరీశ్ జయరాజ్, శ్రీ, చక్రి, మణిశర్మలవద్ద పనిచేశాను. ‘స్పీడున్నోడు’ నా పదవ సినిమా.
* తదుపరి చిత్రాలు?
- జయ దర్శకత్వంలో ‘వైశాఖం’ సినిమా చేస్తున్నాను. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం మూడు పాటలు కంపోజ్ చేశాను. ఇంకా రెండు పాటలు చేయాలి. జయగారు చాలా మంచి సహకారం అందిస్తున్నారు. అలాగే మరో రెండు మూడు సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే తెలియజేస్తా.