అవకాశాల రాశి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య టాలీవుడ్‌లో హీరోయిన్ల హవా బాగా ఎక్కువవుతోంది. గ్లామర్‌తో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తూ వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు అందాల భామలు. ఈ కోవలో అందరికంటే ముందుంటోంది ముద్దుగుమ్మ రాశిఖన్నా. చేసిన కొద్ది చిత్రాలతోనే క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ ఫేవరెట్ అయ్యింది. పలువురు హీరో లు రాశిఖన్నానే కావాలని అడుగుతున్నారట. ఒక్కసారి ఆమె చేసిన హీరోలు సైతం మళ్లీ ఆమెనే తమ సినిమాలో హీరోయిన్‌గా కావాలని పట్టుబడుతున్నారట. ఇప్పటికే గోపీచంద్ రాశితో కలిసి ‘జిల్’ చిత్రంలో నటించాడు. ఆయన తాజాగా నటిస్తున్న ‘ఆక్సిజన్’ చిత్రంలో కూడా రాశిఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే రవితేజ ‘బెంగాల్ టైగర్’ చిత్రంతో ఈ భామతో జోడీ కట్టాడు. తాజాగా రవితేజ నటిస్తున్న ‘రాబిన్‌హుడ్’ చిత్రంలో కూడా ఈమెనే హీరోయిన్. దాంతోపాటు పలువురు యువ హీరోలు కూడా రాశికోసం క్యూ కడుతున్నారట. అందానికి అందం, మంచి నటన కనబరిచే ఈ భామ ఇప్పుడు టాలీవుడ్‌లో దుమ్మురేపుతోంది.