మరో రీమేక్‌లో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో వర్క్ చేసిన తమన్నా తాజాగా ఎన్టీఆర్ జై లవకుశ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో కనిపించింది. ప్రస్తుతం క్వీన్ తెలుగు రీమేక్‌లో నటిస్తోంది ఈ మిల్కీ బ్యూటీ. ఇకపోతే తమన్నా ఒక బాలీవుడ్ సినిమా చేయడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. తమిళంలో 2014లో వచ్చిన సూపర్‌హిట్ చిత్రం ‘జిగర్‌థండా’ను హిందీలో రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాకు బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గన్ నిర్మాతగా వ్యవహరిస్తారు. నిశికాంత్ కామత్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా తమన్నాను సెలక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సౌత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న తమన్నా అయితే సినిమాకు హెల్ప్ అవ్వచ్చనే ఆలోచనతో ఈమెను తీసుకున్నారని సమాచారం.