నంది అవార్డుల ఎంపికలో అవకతవకలు జరిగాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సినీ ప్రముఖులు, అభిమానులు అవార్డుల ఎంపిక న్యాయంగా జరగలేదని విమర్శిస్తుండగా, దర్శకుడు గుణశేఖర్ మరోసారి అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాను స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘రుద్రమదేవి’ సినిమాకు ఆశించిన స్థాయిలో అవార్డులు రాకపోవటంపై ఇప్పటికే స్పందించిన గుణశేఖర్, తాజాగా గురువారం ఫిలిం ఛాంబర్‌లో పాత్రికేయులతో మాట్లాడారు. కావాలనే అల్లు అర్జున్‌ను అవమానించారన్న గుణశేఖర్, స్టార్ హీరోకు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అవార్డు ఇవ్వటం తప్పన్నారు. రుద్రమదేవి జాతీయ నాయకురాలు, ఆమెను కేవలం తెలంగాణ ప్రాంతానికే పరిమితం చేయడం సరికాదన్నారు. ‘అవార్డుల ఎంపికలో అవకతవకలను ప్రశ్నిస్తే మూడేళ్లు నిషేధిస్తారట’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపిలో గుత్త్ధాపత్యం నడుస్తోందని తెలిపారు. ఈ విషయంపై స్పందించిన నిర్మాత నల్లమలుపు బుజ్జి కూడా అసంతృప్తిని వ్యక్తం చేశారు. అవార్డుల ఎంపికలో ఒక వర్గానికి అనుకూలంగా లాబీయింగ్ జరిగిందన్నారు. ఉత్తమ నటుడు అవార్డు ప్రభాస్‌కు ఎందుకివ్వలేదు? రుద్రమదేవి సినిమాకు ఎందుకు అన్యాయం చేశారు? అని ప్రశ్నించారు. మహిళా సాధికారతను చాటుతూ తీసిన రుద్రమదేవి మూడు ఉత్తమ చిత్రాల కేటగిరిలో నిలవలేకపోయిందని, కనీసం జ్యూరీ గుర్తింపు కూడా నోచుకోలేకపోయిందని ఆయన మండిపడ్డారు. సినిమా విడుదల సమయంలో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు ఇచ్చిన సబ్సిడీని రుద్రమదేవి సినిమాకు కావాలని ప్రశ్నించడం తప్ప? మరచిపోయిన తెలుగు జాతి చరిత్రను గుర్తుకు తేవడం కరెక్ట్ కాదా అని ఆవేదన చెందారు. అవార్డుల కోసం రొడ్డెక్కొద్దని కొందరు ప్రొడ్యూసర్లు అంటున్నారు. ఒక హిట్ సినిమా తీస్తే ఆ పెయిన్ ఏంటో తెలుస్తుంది అన్నారు. నంది అవార్డుల విషయంలో తమ సినిమాకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. జనం మెచ్చిన సినిమాను నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. ఎప్పుడూ ప్రెస్ ముందుకు రాని మేము ఇప్పుడు కడుపు మండి వచ్చామన్నారు. ప్రొడ్యూసర్ సి.కల్యాణ్ అవార్డులకోసం రోడ్డెక్కద్దని మాట్లాడారని, ఒక హిట్ సినిమా తీసి మాట్లాడాలని పేర్కొన్నారు. రుద్రమదేవి సినిమాకు అర్హత లేదా? బాహుబలి సినిమా హీరో ప్రభాస్‌కి అవార్డు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. ఇవన్నీ దొంగ అవార్డులేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.