‘2 కంట్రీస్’ ఫస్ట్‌లుక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్.శంకర్ దర్శకత్వంలో మహాలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై సునీల్, మనీషారాజ్ జంటగా రూపొందించిన చిత్రం ‘2 కంట్రీస్’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఈ సందర్భంగా ఎన్.శంకర్ మాట్లాడుతూ- మలయాళంలో ఇదే పేరుతో వచ్చిన చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం వినోదాత్మకంగా రూపొందించామని తెలిపారు. అమెరికా, ఇండియాలోని అద్భుతమైన లొకేషన్‌లలో చిత్రీకరించిన ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఈనెల 24న టీజర్ విడుదల చేస్తామని ఆయన అన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి డిసెంబర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని, భారీ బడ్జెట్‌తో ఉత్తమ సాంకేతిక విలువలతో రూపొందించిన ఈ చిత్రం సునీల్‌కు ఓ మైలురాయి మూవీగా నిలుస్తుందని ఆయన అన్నారు. నరేష్, శ్రీనివాసరెడ్డి, పృధ్వీ, షాయాజీ షిండే, దేవ్ గిల్, కృష్ణ్భగవాన్, చంద్రమోహన్, రాజ్యలక్ష్మి, సితార, రాజా రవీంద్ర, షిజు, సంజన, శివారెడ్డి, ప్రవీణ, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, ఝాన్సీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:గోపీసుందర్, కెమెరా:సి.రాంప్రసాద్, మాటలు:శ్రీ్ధర్ శీపాన, ఎడిటింగ్:కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాత, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఎన్.శంకర్.