అభిమన్యుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరివెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి.హరి తెలుగులో మరో చిత్రాన్ని అందిస్తున్నారు. విశాల్, సమంత జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి అభిమన్యుడు పేరు ఖరారు చేశారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ ఓ వైవిధ్యమైన పాత్రలో నటిస్తుండడం విశేషం. సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఈనెల 18న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా హీరో విశాల్ మాట్లాడుతూ- గతంలో తాను చేసిన సినిమాలకన్నా హైరేంజ్ చిత్రంగా అభిమన్యుడు ఉంటుందని, సంక్రాంతికి మరో హిట్‌గా ఈ చిత్రం నిలుస్తుందని అన్నారు. దర్శకుడు సినిమా కథను వైవిధ్యంగా రాసుకున్నారని, అదేవిధంగా లావిష్‌గా చిత్రీకరించారని ఆయన అన్నారు. షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోందని, డిసెంబర్ 27న ఆడియోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత జి.హరి తెలిపారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేస్తామని ఆయన అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:యువన్ శంకర్‌రాజా, కెమెరా:జార్జి సి.విలియమ్స్, ఎడిటింగ్:రూబెన్, మాటలు:రాజేష్ ఎ.మూర్తి, దర్శకత్వం:పి.ఎస్.మిత్రన్.