ఆ మూడూ హైలైట్సే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘డిటెక్టివ్’ చిత్రంలో నేను చేసిన మూడు ఫైట్ సీన్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. డైలాగ్ చెప్పినపుడు ఎంత పవర్‌ఫుల్‌గా వుంటుందో ఈ మూడు ఫైట్ సీన్లు అంత పవర్‌ఫుల్ దర్శకుడు రూపొందించారు. గోడౌన్ ఫైట్, చైనీస్ రెస్టారెంట్ ఫైట్, మూడోది క్లైమాక్స్ ఫైట్ సినిమాలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న అంశాలుగా వౌత్ టాక్‌తో ఈ చిత్రం ఆదరణ పొందింది అని కథానాయకుడు విశాల్ తెలిపారు. మిస్కిన్ దర్శకత్వంలో జి.హరి నిర్మించిన సస్పెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ డిటెక్టివ్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తమిళంతోపాటు తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుందని హీరో తెలియజేస్తున్నారు. ఇంకా ఆయన మాటల్లోనే...
మంచి పేరుకై
ఎప్పటికప్పుడు కొత్త కథనాలు తీసుకుని ప్రేక్షకుల్ని మెప్పించి మంచి నటుడిగా గుర్తింపు పొందాలని కోరుకుంటా. అయితే కొన్ని సినిమాలు ప్రేక్షకులకు నచ్చవు. కొన్ని అద్భుతంగా ఉంటాయి. ఏదేమైనా డిటెక్టివ్ సినిమా నా కెరీర్‌లోనే మైల్‌స్టోన్‌లా నిలుస్తుంది.
డిటెక్టివ్ అంటే
డిటెక్టివ్ అనే మాట మనం వింటాం కానీ అలాంటివారిని సమాజంలో ఎక్కడా చూడం. ఎందుకంటే వాళ్లెప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లోనే ఉంటారు తప్ప కనిపించరు. అలాంటి ఓ వైవిధ్యమైన పాత్రతో సినిమా చేస్తే ఎలా వుంటుంది అని దర్శకుడు చెప్పడంతో ఉత్సాహం వచ్చింది. ఒక నటుడికి మంచి అవకాశంగా భావించాను.
యునానిమస్‌గా
సినిమా వౌత్ టాక్‌తోనే యునానిమస్‌గా విజయవంతమైంది. మేం ఏదైతే కోరుకున్నామో అది ప్రేక్షకులకు అందింది. విజయం దొరికింది. ఇందుకోసం మా టీమ్ అంతా గర్వంగా ఉంది.
కొత్త ఐడియాలతో
ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో మరెన్నో ఇన్నోవేటివ్ ఐడియాలతో బెటర్ కంటెంట్‌తో సినిమాలు చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం వచ్చింది. అందుకే కొత్తరకమైన కథలకోసమే ఎదురుచూస్తున్నాం.
గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే
నా కెరీర్‌లో మొదటిసారిగా పాటలు లేకుండా చేసిన సినిమా ఇది. అయితే ఎవరూ ఎక్కడా పాటలు లేవన్న లోటును ఫీల్ అవ్వరు. ఎందుకంటే గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో సినిమా సాగుతుంది. దాదాపు 26 నిమిషాలపాటు ఉండే క్లైమాక్స్‌ను చిత్రీకరించడానికి ఎంత కష్టపడ్డామో సినిమా చూస్తే తెలుస్తుంది. అలాగే స్క్రీన్‌ప్లే కూడా హైలెట్‌గా వుంటుంది.
రెండూ వచ్చాయి
ఒక సినిమాకు బాక్సాఫీస్ కలెక్షన్లు బావుంటాయి. కానీ సమీక్షకులు అంత బాగా స్పందించరు. కొన్ని సినిమాలకు క్రిటిక్స్ రివ్యూ అద్భుతంగా వస్తుంది కానీ కలెక్షన్లు ఉండవు. ఈ చిత్రానికి మాత్రం రెండూ దొరికాయి. అదే ఆనందంగా వుంది.

- శ్రీ