మోహినిపై త్రిష ఆశలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాదాపు దశాబ్దకాలంపైగా సౌత్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న అందాల భామ త్రిష కెరీర్‌కు బ్రేకులు పడ్డాయి. పెళ్లి విషయం వాయిదా పడ్డాక కొంత గ్యాప్ తీసుకుని మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. అందుకే ఈసారి సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ తన సత్తాచాటుకునే ఆలోచనలో ఉంది. ఇప్పటికే ఏకంగా 6 సినిమాల్లో నటిస్తున్న ఈ భామ ‘మోహిని’ పేరుతో ఓ హర్రర్ సినిమాలో నటిస్తోంది. పైగా ఈ సినిమా పోస్టర్ ఆమధ్య విడుదలై అందరికీ షాక్ ఇచ్చింది. నీలికలర్‌లో దేవతా రూపంలో ఆరు చేతులత వున్న త్రిషను చూసి.. ఇది భక్తి సినిమానా లేక హర్రర్ సినిమానా అంటూ షాక్ అయ్యారు. చాలాకాలంగా ఈ సినిమా విడుదలకోసం ఎదురుచూస్తున్న త్రిషకు మంచి డేట్ కుదిరింది. వచ్చే నెలలో ఈ సినిమా విడుదల కానుందట. ఇప్పటికే ‘నాయకి’ పేరుతో త్రిష చేసిన హరర్ సినిమా భారీ పరాజయం పాలవ్వడంతో ఈసారి ‘మోహని’పై ఎక్కువ కేర్ పెట్టింది. మరి త్రిష కెరీర్‌కు మోహిని ఎలాంటి సపోర్టు అందిస్తుందో చూడాలి!