కోటి కావాలట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వయసు పెరుగుతున్నా ఇప్పటికీ హీరోయిన్‌గా క్రేజ్ ఉన్న రమ్యకృష్ణకు ‘బాహుబలి’ సినిమాతో సంచలన విజయం దక్కింది. శివగామిగా ఆ పాత్రలో నటించి ఆకట్టుకున్న రమ్యకు ఇప్పుడు దక్షిణాదిలో అవకాశాల జోరు ఎక్కువైంది. ఇప్పటికే నాగార్జున హీరోగా నటించిన ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా హిట్ కూడా తన ఖాతాలో వేసుకున్న రమ్యకృష్ణకు ఇప్పుడు అవకాశాల జోరు పెరగడంతో రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచినట్టు తెలిసింది. ఆమె కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. సాధారణంగా మాజీ హీరోయిన్లంటే కేవలం తల్లి పాత్రలకు, అత్త పాత్రలకే పరిమితవౌతూ వుంటారు. కానీ రమ్యకృష్ణ మాత్రం అన్నిరకాల పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉంది. తాజాగా ‘రుద్రాక్ష’ చిత్రంలో ఆమె దెయ్యం పాత్రలో కన్పిస్తుందని తెలిసింది. రమ్యకృష్ణకు వున్న క్రేజ్‌తో వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ భామ వెనుకాడటంలేదు. మొత్తానికి మాజీ హీరోయిన్లు కోటి రూపాయల పారితోషికం తీసుకోవడం అరుదనే చెప్పాలి. ‘బాహుబలి-2’లో కూడా నటిస్తున్న రమ్య ఈ సినిమా కోసం భారీగానే వసూలు చేసిందని అంటున్నారు.