అందుకే స్పీడ్ తగ్గించా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో వరుస విజయాలతో అటు స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది గ్లామర్ భామ రకుల్‌ప్రీత్‌సింగ్. అటు కుర్ర హీరోల సినిమాల్లోనూ నటిస్తున్న ఈ బ్యూటీ తెలుగుతోపాటు తమిళంలో కూడా బిజీగా మారింది. తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేసిన రకుల్, ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్‌కు గట్టి పోటీగా మారింది. తాజాగా ఆమె కార్తితో కలిసి నటించిన చిత్రం ‘ఖాకి’. హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో ఈ శుక్రవారం విడుదలైంది. పోలీసుగా కార్తి అదరగొడితే.. హౌస్‌వైఫ్ పాత్రలో రకుల్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా హీరోయిన్ రకుల్‌తో ఇంటర్వ్యూ...
చక్కని కథ
నిజంగా ఇలాంటి మంచి కథలతో సినిమాలు మరిన్ని రావాలి. ఖాకి సినిమాలో కార్తి నటన అద్భుతంగా ఉంది. ఈ కథను దర్శకుడు ఎంతో రీసెర్చి చేసి.. గొప్పగా తెరకెక్కించాడు. రియల్ అంశాల స్ఫూర్తితో తెరకెక్కిన ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతమైన సినిమా చూశామని చెబుతున్నారు. నిజంగా ఇది గొప్ప ప్రయత్నం.
మొదట ఆలోచించా..
ఈ సినిమా విషయంలో మొదట దర్శకుడు ఫోన్ చేసి ఇందులో హౌస్‌వైఫ్ పాత్ర అని చెప్పగానే ఆలోచనలో పడ్డా. హౌస్‌వైఫ్ అంటే పెద్ద వయస్సు ఉన్న ఆంటి పాత్ర కాదని.. అప్పుడే పెళ్ళయిన కొత్త జంటగా కనిపిస్తానని దర్శకుడు చెప్పడంతోపాటు పాత్ర కూడా కొత్తగా ఉంటుందని ఓకె చెప్పేశా.. ఇలా భిన్నమైన పాత్రలు చేస్తేనే కదా మనకు మంచి పేరొచ్చేది.. ఇప్పటివరకు హీరోలకు లవర్ పాత్రల్లో కనిపించిన నేను మొదటిసారి హౌస్‌వైఫ్ పాత్ర చేయడం కొత్తగా ఉంది.
డెడికేషన్ ఉన్న నటుడు
హీరో కార్తిలో ఇంత డెడికేషన్ నేను ఊహించలేదు. పాత్ర కోసం ఎంతైనా రిస్క్ చేస్తాడు. అలా చేయకుంటే ఊపిరి, కాష్మొరా, చెలియా లాంటి సినిమాలు రావుగా.. తనతో పనిచేయడం కొత్తగా అనుభూతి, మళ్లీ తనతో కలిసి ఓ ప్యూర్ లవ్‌స్టోరీ చేస్తున్నాను.
స్పీడ్ తగ్గించా..
ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నాను.. ఈ నాలుగేళ్లలో దాదాపు 15 సినిమాలు చేశాను. కొందరేమో రకుల్ స్పీడ్‌కు వేరే హీరోయిన్స్‌కు టెన్షన్ పట్టుకుందంటూ రాస్తున్నారు. అయినా ఇంత స్పీడ్‌గా సినిమాలు చేస్తే తొందరగా రిటైర్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి.. సినిమాలు బాగా తగ్గించా.. ఈమధ్యే నెలరోజులు హాలిడేస్‌ని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేశా.. దానికి రకుల్‌కు అవకాశాలు తగ్గాయి అంటూ మళ్లీ వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా సినిమా విషయంలో కాస్త వేగం తగ్గించాను.
తదుపరి సినిమాలు
ప్రస్తుతం కార్తితో ఓ సినిమా ఉంది. అలాగే మరో తమిళ సినిమా, దాంతోపాటు తెలుగులో రెండు సినిమాలు ఉన్నాయి. అలాగే మహేష్‌బాబు సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయి. తాజాగా హిందీలో అయ్యారి అనే సినిమా చేస్తున్నాను. నీరజ్ పాండే దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.

- శ్రీ