సామాజిక అంశాలతో భరత్ అను నేను..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘్భరత్ అను నేను’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ జోరుగా జరుపుకుంటోంది. ఇటీవలే సిఎం ఛాంబర్‌కు సంబంధించిన పలు సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. ఇందులో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపిస్తాడన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా హీరో కోణం నుండి కాకుండా సామాజిక సమస్యల నేపథ్యంలో ఉంటుందని టాక్? నేటి సమాజంలో జరుగుతున్న పలు అంశాలను ప్రస్తావిస్తారట. అంతేకాదు, దర్శకుడు కొరటాల శివ లైఫ్‌లో చూసిన పలు అంశాలు ఇందులో ఉన్నాయని తెలిసింది. ఆసక్తికర అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే సమ్మర్‌లో విడుదలక సిద్ధం అవుతోంది. మహేష్ సరసన ఖైదా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్-కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమంతుడు తరువాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.