హాలీవుడ్ సినిమాలా యమపాశం ( హీరో నాని)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జయం రవి, లక్ష్మీమీనన్ జంటగా శక్తిసౌందర్‌రాజన్ దర్శకత్వంలో సినీకార్న్ బ్యానర్ పతాకంపై ముఖేష్ ఆర్.మెహతా నిర్మించిన ‘మిరుధన్’ అనే తమిళ చిత్రాన్ని ‘యమపాశం’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు నిర్మాత బాలకృష్ణ. ఇమాన్ సంగీతం అందించిన ఈ పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న హీరో నాని సీడీని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ట్రైలర్స్ చూస్తుంటే హాలీవుడ్ సినిమాలా ఫీలింగ్ కలుగుతోందని, హాలీవుడ్‌లో తప్ప ఎక్కడా చేయని జోంబి జోనర్‌లో ఈ సినిమా తీశారని అన్నారు. తెలుగువాడైన జయం రవి వరుసగా పెద్ద పెద్ద కమర్షియల్ సినిమాల్లో నటిస్తూ, తమిళంలో రాణిస్తున్నాడని, అతని గత సినిమా ‘తనిఒరువన్’లా ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు. జయం రవి మాట్లాడుతూ, హ్యూమన్ వర్సెస్ హ్యూమన్ సినిమాలు చాలా వచ్చినా, గ్లోబల్ కానె్సప్టుతో నేచర్ వర్సెస్ హ్యూమన్ కానె్సప్టుమీద చేసిన సినిమా ఇదన్నారు. ఈరోజు మనం ప్రకృతిని నాశనం చేస్తున్నామని, అది తిరగబడితే ఎలా వుంటుందనేది ఈ సినిమా అని, ఇమాన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడని, ఈ చిత్రాన్ని ఈనెల 19న విడుదల చేస్తున్నామన్నారు. మోహన్‌రాజా మాట్లాడుతూ, రవి, నేను చేసిన ‘తనిఒరువన్’ సినిమా తెలుగులో రీమేక్ చేస్తున్నారని, రవి సౌత్ ఇండియన్ హీరోగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నానన్నారు. ఈ సినిమా ప్రేక్షకులను ఖచ్చితంగా ధ్రిల్ కలిగిస్తుందన్నారు.. ఈ కార్యక్రమంలో జ్ఞాన్‌వేల్‌రాజా, పోసాని, నాగినీడు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.