నందులకు ప్రాంతీయత లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు ఐదు సంవత్సరాలుగా నంది అవార్డుల ఊసే ఎత్తుకోలేదు. తాజాగా మూడేళ్ల నంది అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుకు ‘సైకిల్’ అవార్డులని, ‘కమ్మ’నైన అవార్డులని అనేక విమర్శలను అంటగట్టారు. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరుగా అవార్డులు రానివాళ్లు బయటికి వచ్చి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందై. అయితే తాజాగా నటుడు, దర్శకుడు, ఉత్తమ సహాయనటుడి అవార్డును ప్రకటించిన పోసాని కృష్ణమురళి ఈ అవార్డుల వివాదంపై తనదైన స్టయిల్‌లో సమాధానం చెప్పారు. అవార్డు వివాదాలపై మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై పోసాని కృష్ణ మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవార్డులను గురించి మాట్లాడిన వారిని నాన్‌లోకల్ వ్యక్తులుగా పరిగణించడం సరైన పద్ధతి కాదని, అందరికీ సంబంధించిన విషయంపై మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికీ వుందని అంత మాత్రాన వారిని నాన్‌లోకల్స్‌గా (నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్)గా అభివర్ణించడం సరైన పద్ధతికాదని ఆయన దుయ్యబట్టారు. నాన్ లోకల్‌గా అందరినీ పరిగణించే మీరు నాన్‌లోకల్ వ్యాపారాలు చేయడం లేదా? తెలంగాణలో మీకు ఇళ్లు, బంగ్లాలు వ్యాపారాలు లేవా? అని ప్రశ్నించారు. కేవలం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితమై మీ వ్యక్తి గత వ్యవహారాలు నిర్వహించుకుంటున్నారా? అంటూ ఎద్దేవా చేశారు. నంది అవార్డులకు ప్రాంతీయత అనే అంశా న్ని అట్టగట్టడం సరైన పద్ధతి కాదని, ఒకరిద్దరు అవార్డులపై వ్యాఖ్యానిస్తే మొత్తం అవార్డులను రద్దుచేస్తామనడం సరైన పద్ధతికాదని ఆయన హితవు పలికారు. ఈ వివాదాలను సామరస్య ధోరణిలో ప్రయత్నించి పరిష్కారం చేయాలని, అందుకే ఈ సందర్భంగా తనకు ప్రకటించిన నంది అవార్డును తిరస్కరిస్తున్నానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో వివాదాల మాటున మరిన్ని తిరస్కరణలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మొదటి అడుగు పడింది కనుక నంది అవార్డుల ప్రదానోత్సవ ప్రస్థానం ఏ విధంగా సాగుతుందో అన్న విషయం ఆసక్తిగా మారింది.