నిర్మాతల మండలి కార్యవర్గం రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత ఎన్నో సంవత్సరాలుగా తెలుగు సినిమా నిర్మాతల మండలి సభ్యులు కోరిన విధంగా ప్రస్తుతం వున్న కార్యవర్గాన్ని రద్దుచేశారు. గత ఆదివారం జరిగిన 17వ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ప్రస్తుతం వున్న కార్యవర్గాన్ని తక్షణమే రద్దుచేసి వెంటనే అడ్‌హాక్ కమిటీని ఏర్పాటుచేసి ఎన్నికలు నిర్వహించాల్సిందిగా తీర్మానించడమైనదని ప్రకటించారు. అనేక సంవత్సరాలుగా కోర్టు కేసులు అడ్డం పెట్టుకుని ఎన్నికలు జరిపించకుండా వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పకుండా, అది కోర్టు ధిక్కారమని తెలిసి కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరించి అనేక అవకతవకలకు, లక్షలాది రూపాల నిధుల దుర్వినియాగానికి పాల్పడినా ఎవరూ పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. చిన్న నిర్మాతల సమస్యలను పట్టించుకోకుండా స్వార్థంతో తమ వ్యక్తిగత లాభం కోసం ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ పనివిధానానికి వ్యతిరేకతవచ్చినా పట్టించుకోకుండా తమ సొంత సంస్థలా నడిపారని వారన్నారు. మూవీ టవర్స్‌లో కొన్ని కోట్లు వెచ్చించడం, నిర్మాతల ఎదుగుదల కోసం మండలిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేయడం, రెండు లక్షల ఖర్చుతో తమ స్వంత ప్రయోజనాలకోసం టిఎఫ్‌పిసి వెబ్‌సైట్‌ను నడపడం, ఆఫీస్ బేరర్లు మండలి కార్యాలయానికి రాకూడదనే నియంతృత్వ పోకడ, హెల్త్ ఇన్సూరెన్స్‌లను రెన్యువల్ చేయకుండా సభ్యులను ఇబ్బంది పెట్టడం తదితర అంశాలు ఇన్నాళ్లు జరిగాయని వారన్నారు. ఇతర రాష్ట్రాలకన్నా పెరిగిన క్యూమ్, యుఎఫ్‌ఓ రేట్లు తగ్గించే ప్రయత్నం చేయలేదని, చిన్న నిర్మాతలు థియేటర్ల సమస్యతో అల్లాడుతుంటే ఒకరిద్దరి కోసం మాత్రమే పనిచేశారని, ఇలా అనేక పరిష్కారం కాని సమస్యలతో విసిగిపోయిన సభ్యులు ఎన్నికలు రావడం సంతోషదాయకమని వ్యాఖ్యానించారు.