సంక్రాంతికే టచ్ చేస్తా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘రాజా ది గ్రేట్’ సినిమా తరువాత రవితేజ చేస్తోన్న సినిమా ‘టచ్ చేసి చూడు’. విక్రమ్ సిరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు ప్రీతమ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజా సమాచారం ప్రకారం జనవరి 13న ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ భావిస్తోందని తెలుస్తోంది. రాశీఖన్నా, సీరత్‌కపూ ఈ సినిమాలో కథానాయికలుగా నటిస్తున్నారు. కోన వెంకట్ ఈ సినిమాకు కథ అందించడం జరిగింది. జనవరిలో సంక్రాంతి సందర్భంగా బాలకృష్ణ ‘జై సింహ’, పవన్ ‘అజ్ఞాతవాసి’ సినిమాలు విడుదల కానున్న సంగతి తెలిసిందే.