అందరికీ నచ్చేలా నెపోలియన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆనంద్ రవి కథానాయకుడిగా ఆచార్య క్రియేషన్స్, ఆనంద్ రవి కానె్సప్ట్ పతాకాలపై ఆనంద్ రవి దర్శకత్వంలో భోగేంద్ర గుప్త మడుపల్లి రూపొందించిన చిత్రం ‘నెపోలియన్’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 24న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో బుధవారం ఉదయం ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో కథానాయకుడు ఆనంద్ రవి మాట్లాడుతూ- ఈ వారం విడుదలవుతున్న చిత్రాలలో తమ సినిమాకు మంచి క్రేజ్ వుందని, చిన్న సినిమాగా ప్రారంభించి పెద్దరేంజ్‌లో హైప్ తీసుకున్న చిత్రంగా అందరూ చెబుతున్నారని, నీడ పోయింది అని రిపోర్టు ఇచ్చే కామన్‌మాన్ కథే ఈ సినిమా అని ఆయన తెలిపారు. కొత్తదనంతో చేసిన ఈ చిత్రం అందరికీ నచ్చేలా ఔట్‌పుట్ వచ్చిందని నిర్మాత భోగేంద్ర గుప్తా అన్నారు. సినిమా డిఫరెంట్‌గా వుండి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుందని కథానాయిక కోమలి తెలిపారు. కార్యక్రమంలో రవివర్మ, సిద్ధార్థ్ సదాశివుని, మార్గల్, డేవిడ్, తదితరులు పాల్గొని విశేషాలు తెలిపారు.