నటించడం ఇబ్బందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతంలో ఎంతమంది మహిళా నిర్మాతలు వచ్చారో తెలియదు. కానీ ఈ సినిమాను ఇష్టపడి కష్టమైనా చేశాను. ఓ రకంగా నటించడం చాలా ఇబ్బందికరమైన విషయమే అని నటి జయతి తెలిపారు. గెడ్డం జయతి నటిస్తూ నిర్మించిన చిత్రం ‘లచ్చి’. ఈశ్వర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా జయతి పలు విశేషాలు తెలుపుతూ ఔట్‌డోర్ లొకేషన్‌లో దాదాపు 70 రోజులపాటు ఈ సినిమా చేశామని, వెనె్నల కార్యక్రమం చేసేటప్పుడు ఎంత ఆదరించారో, అలాగే ఈ చిత్రంలో కూడా ఆదరిస్తారన్న నమ్మకం ఉందని ఆమె అన్నారు. ముందుగా ఈ సినిమాలో నటించాలని అనుకోలేదని, అయితే పాత్ర చాలా డీసెంట్‌గా వుండడంతో తాను చేయగలనన్న నమ్మకం రావడంతో సిద్ధమయ్యానని తెలిపారు.