డాన్స్‌ల సప్తగిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సప్తగిరి హీరోగా సాయి సెల్యూలాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకంపై చరణ్ లక్కాకుల దర్శకత్వంలో డా.రవికిరణ్ రూపొందించిన తాజా చిత్రం ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’. హిందీలో విజయవంతమైన ‘జాలీ ఎల్‌ఎల్‌బి’ని తెలుగులో రీమేక్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని డిసెంబర్ 7న విడుదలకు సిద్ధం చేశారు. బుల్గానిన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సంబంధించిన తొలి పాటను దర్శకుడు వి.వి.వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- హాస్యనటుడిగా పరిచయమైనా సప్తగిరి తనలో డాన్సు చేసే శక్తి బాగా వుందని ఈ చిత్రంతో నిరూపిస్తాడని, ఓ రకంగా ఇరగదీశాడని తెలిపారు. తనకు ఈ కథ నచ్చినా ఎవరితో తీయాలో అర్థంకాక వదిలేశానని, స్ట్రాంగ్ కంటెంట్‌తో అందరికీ నచ్చేలా సాగే ఈ చిత్రం దర్శకుడికి కూడా మంచి పేరు తెస్తుందని అన్నారు. నిర్మాత రవికిరణ్ మాట్లాడుతూ- ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి ఆదరణ లభిస్తోందని, వినాయక్ ఆవిష్కరించిన ఈ పాట అందరికీ నచ్చుతుందని, తమ సంస్థనుండి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు వస్తాయని తెలిపారు. మంచి మనసుతో తమ యూనిట్‌ను ఆశీర్వదించిన దర్శకులకు కృతజ్ఞతలని మంచి కథతో రూపొందించిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందని కథానాయకుడు సప్తగిరి అన్నారు. నిర్మాత రాజీపడకుండా ఈ చిత్రం రూపొందించారని దర్శకుడు చరణ్ లక్కాకుల తెలిపారు. కార్యక్రమంలో బుల్గానిన్ తదితరులు పాల్గొని విశేషాలు తెలిపారు. కశీష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, సంగీతం: విజయ్ బుల్గానిన్, కెమెరా: సారంగం ఎస్.ఆర్, పాటలు: చంద్రబోస్, కందికొండ, నిర్మాత: డా.రవికిరణ్, దర్శకత్వం: చరణ్ లక్కాకుల.