చరిత్ర హీనుల బారాత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటి దీపికా పదుకొనె ముక్కును కోస్తామని బెదిరించారు. ఇది దుర్మార్గం. మధ్యలో ఆ అమ్మాయి ఏం తప్పు చేసింది. డబ్బు తీసుకుని వాళ్లు ఇచ్చిన పాత్రలో నటించింది. ఇలా ముక్కులు కోయటం మొదలుపెడితే భారతదేశంలో అంతా శూర్పణకలవలె మిగిలిపోతారు. మనం హైదరాబాద్‌లో మద్రాసులో ఇవ్వాళ సుఖంగా జీవిస్తున్నామంటే అందుకు రాజపుత్రుల త్యాగాలే కారణం. రాజపుత్ర జాతిని అవమానించే అధికారం సంజయ్‌లీలా భన్సాలీకి ఎక్కడిది?
‘‘ఇటీవల కొన్ని చారిత్రక చిత్రాలు వివాదాస్పదమవుతున్నాయి. అసలు చారిత్రక చిత్రాలు తీయడమే ఒక అదృష్టం. కాబట్టి వారిని విమర్శించటం నిరుత్సాహపరచటం కూడదు. కాని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పురస్కారాల్లో చారిత్రక చిత్రాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోవటంలేదంటే అందుకు చాలా కారణాలుంటాయి. ప్రాంతం కులం రాజకీయ ప్రాబల్యం వంటి అనేకాంశాలు పురస్కారాలను ప్రభావితం చేస్తూ ఉంటాయి. గత అరవై సంవత్సరాలుగా కేంద్ర సాహిత్య పురస్కారాలను కమ్యూనిస్టులు కొనుక్కోవటం మళ్లీ నరేంద్ర మోదీ మీది కోపంతో ‘అవార్డు వాపసీ’ ఉద్యమం నిర్వహించటం అందరికీ తెలిసిన సంగతే కదా- అంటే ఇవన్నీ రాజకీయ ప్రేరణతో జరుగుతాయి’’ అంటున్నారు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్. చారిత్రక చిత్రాలు వివాదాస్పదమవుతుండటం ఒకవైపు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన నంది అవార్డుల గోల మరో వైపు.. ఈ నేపథ్యంలో ముదిగొండ శివప్రసాద్‌తో ‘ఆంధ్రభూమి’ చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూ..
* 2017లో నంది అవార్డులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై చిత్ర రంగంలో కల్లోలం మొదలైంది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
- నేను బాహుబలి, రుద్రమదేవి అనే రెండు సినిమాలు మాత్రమే చూశాను. కాబట్టి చూడని సినిమాలపై వాటి మంచి చెడ్డలపై నేను వ్యాఖ్యానించటంలో ఔచిత్యం లేదు.
* జ్యూరీ మెంబర్లు ఒకే సామాజిక వర్గానికి చెందినవారనే ఆరోపణలు ఉన్నాయి?
-జ్యూరీకి నిజాయితీ ముఖ్యం కాని ఏ కులానికి చెందినవారనే ప్రశ్న ముఖ్యం కాదు.
* గుణశేఖర్ తన ‘రుద్రమదేవి’ చిత్రానికి అవార్డు రాకపోవటంపై అసంతృప్తి వ్యక్తం చేయటం గమనించారా?
- నేను ఈ విషయంపై వ్యాఖ్యానించగలను. గుణశేఖర్ ఆర్థికంగానూ హార్థికంగానూ ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఈ చిత్రం నిర్మించాడు. ఇది క్రీ.శ.1250 నాటి కథ. ఈ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వలేదు. రుద్రమదేవి తాను ‘ఆంధ్ర’ పాలకురాలిని అని సగర్వంగా ప్రకటించుకున్నది. ఆమె సామ్రాజ్యం తమిళనాడులోని కాంచీపురం వరకు వ్యాపించింది. రుద్రమదేవి ఉత్తర భారతదేశం నుండి వచ్చిన రాజకీయ దండయాత్రలను నిరోధించింది. తర్వాత వచ్చిన రెండవ ప్రతాపరుద్రుడు ఆ పని చేయలేకపోయాడు. ముందు మాలిక్ కాఫర్ చేతిలోను తర్వాత ఉలుగ్‌ఖాన్ చేతిలోను ఓడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. రుద్రమదేవి చరిత్రను విదేశీ యాత్రికులు మార్కోపోలో వంటి వారు వేనోళ్ల ప్రశంసించారు. ఇక్కడ గమనింపవలసిన అంశం ఏమంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బహుశా ఆర్థికమైన ఇబ్బందులవల్ల రుద్రమదేవికి సబ్సిడీ ఇచ్చి ఉండకపోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం సంపన్నమైనది కాబట్టి వారు సబ్సిడీ ఇచ్చారు.
* బహుబలి చిత్రానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇచ్చి రుద్రమదేవిని ఎందుకు నిర్లక్ష్యం చేసినట్లు?
- బాహుబలిలో సాంకేతిక విలువలు, గ్రాఫిక్స్ బాగున్నాయి. ఇక కథాపరంగా చూస్తే అదొక విఠలాచార్య జానపదం- కాకుంటే నిర్మాతలు- రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సన్నిహితులు. అందువల్ల పురస్కారాల పంట పండింది.
* బాహుబలి 1500కోట్లు ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. దానిని పరిగణనలోకి
తీసుకోవాలి కదా!
- నిజమే. ఒక తెలుగు చిత్రం ఇలా డబ్బు వసూలు చేయటం ఫిలిం ఫీల్డుకు గర్వకారణమే. అయితే అవార్డులకు, వసూళ్లకు సంబంధం ఉండకూడదు. నా చిన్నప్పుడు పిచ్చిపుల్లయ్య లాంటి ఫెయిల్ చిత్రాలకు కేంద్ర పురస్కారాలు రావటం గుర్తుంది. థియేటర్ దగ్గర ఒక్కరోజు ఆడకపోయినా సందేశమూ కళాత్మక విలువలు ఉంటే అవార్డులు ఇవ్వాలి.
* నాగార్జున - బాలకృష్ణల సినిమా రంగ వైరం ఈ అవార్డులమీద ప్రభావం చూపిందని అంటున్నారు?
- నాకు చారిత్రకాంశాలే కాని ఈ కాల సమీకరణాల గురించి అంతగా పరిజ్ఞానం లేదు. పైగా వారిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి స్పర్థ అనవసరం. అంతా కలిసిమెలిసి ఉంటే మంచిది.
* అవార్డులు చంద్రబాబుగారి జోక్యంతో జరిగాయని ఆరోపిస్తున్నారు?
- ఇది అబద్ధం. జ్యూరీని నిర్ణయించే వరకే ప్రభుత్వ ప్రమేయం ఉంటుంది. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రతిదానికీ చంద్రబాబును కెసిఆర్‌ను ఆడిపోవసుకోవటం తగదు. అవార్డులలో అవతకవతలు ఏమైనా ఉంటే అందుకు జ్యూరీయే సమాధానం చెప్పాలి.
* తెలంగాణలో ‘సింహ’ పురస్కారాలు పెట్టబోతున్నట్లు తెలిసింది?
- మంచిదే, స్వాగతిద్దాం.
* సంజయ్ లీలా భన్సాలీ నిర్మించిన చారిత్రక చిత్రం ‘పద్మావతి’పై ఇలాంటి వివాదం ఎందుకు వచ్చింది?
- అల్లాఉద్దీన్ చరిత్రపై నాకు పరిపూర్ణమైన అవగాహన ఉంది. బాలీవుడ్ నిర్మాతలకు డబ్బుపై వున్న యావ చారిత్రక ప్రామాణ్యంపై ఉండదు. అల్లా ఉద్దీన్‌కు పద్మావతికి డ్యూయెట్లు పెట్టి సినిమా తీయటం దేశద్రోహం కిందికివస్తుంది.
* నటి దీపికా పదుకొనె ముక్కును కోస్తామని బెదిరించారు?
- ఇది దుర్మార్గం. మధ్యలో ఆ అమ్మాయి ఏం తప్పు చేసింది. డబ్బు తీసుకుని వాళ్లు ఇచ్చిన పాత్రలో నటించింది. ఇలా ముక్కులు కోయటం మొదలుపెడితే భారతదేశంలో అంతా శూర్పణకలవలె మిగిలిపోతారు. మనం హైదరాబాద్‌లో మద్రాసులో ఇవ్వాళ సుఖంగా జీవిస్తున్నామంటే అందుకు రాజపుత్రుల త్యాగాలే కారణం. రాజపుత్ర జాతిని అవమానించే అధికారం సంజయ్‌లీలా భన్సాలీకి ఎక్కడిది?
* మీరు వంద పుస్తకాలు వ్రాశారు. శాతవాహనులపై ఆరు పుస్తకాలు వ్రాశారు. శాతవాహనులు తెలంగాణాకు చెందినవారు అని ఇటీవల ఒక వాదం మొదలయింది?
- కోటిలింగాల వద్ద శాతవాహన నాగరికతా చిహ్నాలు వెలుగులోకి వచ్చాయి. పైగా ఇది ప్రతిష్ఠానపురానికి కొంత సమీపంలో ఉంది కూడా. కాబట్టి ‘కోటిలింగాల’ ఒకప్పుడు శాతవాహన నగరంగా ఉంది అని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి శ్రీకాకుళం కూడా శాతవాహనుల రాజధానులే. ఇవన్నీ చారిత్రక చిత్రాలల్లో చూపించాలి.
చారిత్రక జ్ఞానం లేనివాడు చరిత్రహీనుడు అవుతాడు. అప్పుడు అదొక అంగుష్టమాత్రుల బారాత్ అవుతుంది.
* మీరు చిత్రరంగానికి ఇచ్చే సందేశం ఏమిటి?
- చారిత్రక చిత్రాలు నిర్మించండి, చారిత్రక చిత్రాలకు అవార్డులు, సబ్సిడీలు ఇవ్వండి.

-ఎం.డి అబ్దుల్