శర్వానంద్ ప్రేమకథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుస విజయాలతో జోరుమీదున్న యువ హీరో శర్వానంద్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినీ పతాకంపై ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.1 చిత్రం హైదరాబాద్‌లో గురువారం ప్రారంభం అయింది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దిల్‌రాజు క్లాప్ కొట్టగా, కొరియోగ్రాఫర్ రాజు సుందరం కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు సుకుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ- లై సినిమా తరువాత చేస్తోన్న చిత్రమిది. ఔట్ అండ్ ఔట్ ప్రేమకథతో తెరకెక్కుతోంది. సరికొత్త తరహా పాత్రలో శర్వానంద్ కనిపిస్తాడు. కథ నచ్చి నామీద నమ్మకంతో నా మిత్రులు ప్రసాద్, సుధాకర్‌లు సినిమాను నిర్మిస్తుండడం ఆనందంగా వుంది. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరూపించుకుంటాను అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ- ఈ బ్యానర్‌లో చేస్తున్న మొదటి చిత్రమిది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా సరికొత్త తరహాలో తెరకెక్కే ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. మిగతా నటీనటుల వివరాలు త్వరలో తెలియజేస్తామన్నారు. ఈ చిత్రానికి సంగీతం:విశాల్ చంద్రశేఖర్, నిర్మాతలు:ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరుకూరి, దర్శకత్వం:హను రాఘవపూడి.