సుమంత్ మళ్లీ రావా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుమంత్, ఆకాంక్షా సింగ్ జంటగా గౌతమ్ తిన్న సూరి దర్శకత్వంలో శ్రీ నక్కా యాదగిరి స్వామి ఆశీస్సులతో స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాహుల్ నక్కా నిర్మించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘మళ్లీ రావా’. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 8న విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో టీజర్‌ను విడుదల చేశారు. అనంతరం దర్శకుడు గౌతమ్ మాట్లాడుతూ- ఇది నా మొదటి చిత్రం. రెండు సంవత్సరాల క్రితం కథ రాసుకున్నాను. చాలామందికి చెప్పాను. కానీ ఎవరూ ముందుకు రాలేదు. చివరగా రాహుల్ ముందుకు రావడంతో సినిమా మొదలైంది. ప్రేమికులమధ్య నడిచే లవ్, డ్రామాతో వీరి చుట్టూ వున్న వ్యక్తుల కారణంగా వారి లైఫ్ ఎలా మారింది అనే కథాంశంతో తెరకెక్కిస్తున్నాం. 30 రోజుల్లో చిత్రీకరణ పూర్తిచేశాం. శ్రవణ్ అందించిన సంగీతం హైలెట్‌గా నిలుస్తుంది అన్నారు.