కొరటాల శివతో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రంలో నటిస్తున్నాడు అల్లు అర్జున్. వక్కం తం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రం తరువాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాకు అప్పుడే సన్నాహాలు జరుగుతున్నాయి. ఆయన తదుపరి చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో ఉంటుందని వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కొరటాల శివతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు క్యూ కట్టారు. ప్రస్తుతం మహేష్‌తో ‘్భరత్ అను నేను’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న కొరటాల, తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్‌తో చేయాలని ప్లాన్ చేశాడు. కానీ ఎన్టీఆర్ ఇదివరకే త్రివిక్రమ్‌తో సినిమాతో కమిట్ అవ్వడంతో కొరటాల దృష్టి అల్లు అర్జున్‌పై పడింది. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అనగానే ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అన్నీ కుదిరితే జనవరి తరువాత వీరి కాంబినేషన్‌లో రూపొందే చిత్రం సెట్స్‌పైకివచ్చే అవకాశాలున్నాయి.