ఒక్క అమ్మాయ తప్ప టాకీ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సందీప్‌కిషన్, నిత్యామీనన్ జంటగా రాజసింహ తాడినాడ దర్శకత్వంలో భోగాది అంజిరెడ్డి రూపొందిస్తున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘ఒక్క అమ్మాయ తప్ప’. ఈ చిత్రానికి సంబంధించిన టాకీపార్ట్ పూర్తిచేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, మరో మూడు పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ వుందని, ఇందులో ఒక పాటను మన దేశంలో, రెండు పాటలను విదేశాలలో చిత్రీకరిస్తామని, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌తో నడిచే ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఏప్రిల్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. ‘ఒక్క అమ్మాయ తప్ప’ అనే చిత్రాన్ని ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్న ట్యాగ్‌లైన్‌తో రూపొందించామని, నేనొక తెలివైన కాలేజీ కుర్రాడి పాత్రలో నటించానని, మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని కథానాయకుడు సందీప్‌కిషన్ తెలిపారు. సరికొత్త కథనంతో సాగే ఈ చిత్రంలో సందీప్‌కిషన్ పాత్ర హైలెట్‌గా వుంటుందని, హిందీ నటుడు రవి కిషన్ విలన్‌గా నటించారని, సుమారు గంటా 30 నిమిషాలపాటు గ్రాఫిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని దర్శకుడు తెలిపారు. అలీ, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, రావు రమేష్, రాహుల్‌దేవ్, పృధ్వీ, సప్తగిరి, తా.రమేష్, నళిని, జ్యోతి, రేవతి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:చోటా కె.నాయుడు, సంగీతం:మిక్కీ జె మేయర్, నిర్మాత:్భగాది అంజిరెడ్డి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:రాజసింహ తాడినాడ.