‘మహానటి’ పాత్ర అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానటి సావిత్రి జీవితం ఆధారంగా ‘మహానటి’ పేరుతో దర్శకుడు నాగ్ అశ్విన్ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ పరిశ్రమల్లో అగ్రస్థాయి నటిగా వెలుగొందిన సావిత్రి జీవితంలోని అనేక విశేషాలతో రూపొందుతున్న సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ స్థాయి అంచనాలున్నాయి. అంతేగాక స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ సావిత్రి పాత్రను పోషిస్తుండడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత ఎక్కువైంది. సావిత్రిగారిలా నటించడం ఛాలెంజింగ్‌గా ఉందని, ఈ పాత్రలో నటించడం అద్భుతమని కీర్తి సురేష్ చెప్పుకొచ్చారు. సినిమాలో రియాలిటీ కోసం ఆమె చేసిన సినిమాలు ‘మాయాబజార్’ లాంటి వాటినుండి కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడం జరిగింది. కథలో సావిత్రిగారి వయసు మారుతుంది కాబట్టి అందుకు తగ్గట్టుగా మారుతూ ఉండాలి. ఈ సినిమా కోసం సుమారు 100 కాస్ట్యూమ్స్‌లో కనిపిస్తున్నాను. నా కెరీర్‌లో ఇదే ఇప్పటివరకూ ఛాలెంజింగ్ రోల్ అన్నారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, సమంత, షాలిని పాండే, విజయ్ దేవరకొండ, మోహన్‌బాబు వంటివారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.