సమంత యూ టర్న్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పటికే సౌత్‌లో క్రేజీ హీరోయిన్‌గా ఇమేజ్ తెచ్చుకున్న బ్యూటీ సమంత తాజాగా తనకు బాగా నచ్చిన సినిమా కోసం సిద్ధమవుతోంది. 2016లో విడుదలైన కన్నడ థ్రిల్లర్ ‘యూ టర్న్’ భారీ విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అంటే సమంతకు చాలా ఇష్టం. ఈ సినిమాని రీమేక్ చేయాలని ఆమె ఎన్నాళ్లగానో అనుకుంటున్నారు. గతంలో చిత్ర దర్శకుడు పవన్‌కుమార్‌ను కూడా పలుసార్లు కలిసి చర్చలు జరిపారామె. ఎట్టకేలకు ఆ తరుణం రానే వచ్చింది. త్వరలోనే ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారట. తెలుగుతోపాటు తమిళంలో కూడా ఈ సినిమాను రీమేక్ చేస్తారట. ఇకపోతే సమంత ప్రస్తుతం ‘రంగస్థలం 1985, మహానటి, అభిమన్యుడు’ వంటి సినిమాలతోపాటు శివ కార్తికేయన్, విజయ్ సేతుపతి సినిమాల్లో సైతం నటిస్తున్నారు. ఈ సినిమాతో మళ్లీ తన సత్తా చాటేందుకు రెడీ అవుతోంది.