మలయాళంలోకి అజ్ఞాతవాసి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. అభిమానుల కోరిక మేరకు ‘అజ్ఞాతవాసి’ అని నామకరణం చేసుకొని రెడీ అవుతున్న ఈసినిమా బాక్సాఫీస్ దాహం ఎంత తీర్చుకొంటుందో అని విశే్లషకులు లెక్కలు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ క్రేజ్ అంటే మామూలుగా వుంటుందా మరి! ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగువాళ్లతోపాటు ఇతర భాషల వాళ్లు కూడా పవర్‌స్టార్ 25వ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అయితే పవన్‌కళ్యాణ్‌కు నార్త్‌సైడ్ కూడా ఫాలోయింగ్ బాగానే వుంది. అప్పట్లో సినిమాలో ఒక హిందీ సాంగ్ వచ్చేట్టు తప్పకుండా సెట్ చేయించుకునేవాడు. ఇకపోతే కేరళలో కూడా పవర్‌స్టార్ సినిమాలకు మంచి ఫాలోయింగ్ వుంది. అయితే మలయాళంలో అజ్ఞాతవాసి డైరెక్టుగా తెలుగులో, వీలైతే మలయాళ డబ్బింగ్ వెర్షన్ కూడా రిలీజ్ కానున్నదట. సాధారణంగా పవన్ యాక్షన్ సీన్స్‌ను మలయాళీ సినీ ప్రేమికులు భాషతో సంబంధం లేకుండా ఎక్కువగా ఇష్టపడతారు. ఇక అజ్ఞాతవాసిలో అలాంటి ఎపిసోడ్స్ కూడా చాలానే వున్నాయట. ఇకపోతే కేరళ అభిమానులు అజ్ఞాతవాసిని ఎక్కువగా ఇష్టపడడానికి మరికొన్ని కారణాలు కూడా వున్నాయి. అనిరుధ్ కొలవరి సాంగ్ అక్కడివారికి తెగ నచ్చేసింది. దీంతో సంగీత దర్శకుడు అనిరుధ్ సినిమాలను వారు చాలా ఇష్టపడతారు. ఎలాగూ మలయాళీ భామలు కీర్తిసురేష్, అను ఇమ్మాన్యుయేల్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తుండడం మరో కారణం. దీంతో నిర్మాతలు మల్లు గడ్డపై భారీ స్థాయిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2018 జనవరి 10న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. మరి మల్లు ఫ్యాన్స్‌ను పవన్ ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.