తమిళ దర్శకుడితో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి, ఘాజి, నేనే రాజు నేనే మంత్రి చిత్రాల ద్వారా వరుస విజయాలు సాధించిన రానాకు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. తాజాగా ఈయన 1945 అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. సత్య వివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రెజీనా హీరోయిన్‌గా నటిస్తోంది. కె ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్.ఎన్.రాజరాజన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా రానా మరో సినిమాకు కమిట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం బ్యానర్‌లో మరకతమణి సినిమా దర్శకుడు శరవణన్ దర్శకత్వంలో రానా నటించబోతున్నాడట. కథా చర్చల్లో వున్న ఈ సినిమాను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు నిర్మాతలు.

‘రాజారథం’లో..

నిరూప్ భండారీ, అవంతికా శెట్టి తెలుగు తెరకు పరిచయమవుతున్న చిత్రం ‘రాజారథం’. ఈ చిత్రం జనవరి 25న విడుదలకు సిద్ధమైంది. ఈ టీమ్‌తో నటుడు రానా కూడా కలవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే ఆయన పాత్ర ఏంటి? అనేది ఈ చిత్ర యూనిట్ సస్పెన్స్‌గా వుంచింది. ఉత్తమ ప్రమాణాలతో సినిమా అందించాలనే తపనతో నిర్మాత అజయ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆకట్టుకునే ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌తో ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అంచనాలు పెరిగాయని నిర్మాత తెలియజేస్తున్నారు.