రెండో విశ్వరూపం చూపిస్తాడా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వివాదాలు చుట్టుముట్టినా విలక్షణ నటుడు కమల్‌హాసన్ నాలుగేళ్ల క్రితం నిర్మించి నటించిన ‘విశ్వరూపం’ మంచి విజయాన్ని అందుకుంది. ఓ అండర్ కవర్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్‌గా ‘లోకనాయకుడు’లో కమల్ నటన అందరినీ ఆకట్టుకుంది. విశ్వరూపం సినిమా కథ ముగిసిపోలేదని, రెండో పార్ట్ కంటిన్యూ అవుతుందని, ఫస్ట్‌పార్ట్‌లోనే క్లియర్‌గా చెప్పారు. దానికితోడు విలన్ వేసిన ప్లానును భగ్నం చేయడంతో ఫస్ట్ పార్ట్ ముగుస్తుంది. సుధీర్ఘ విరామం తరువాత విశ్వరూపం-2 మూవీని కమల్ ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాడు. విశ్వరూపం-2 ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసి వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా విడుదల చేయడానికి కమల్ సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన వర్కింగ్ స్టిల్‌ను కమల్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేశారు. ఇందులో హీరోతోపాటు హీరోయిన్ ఆండ్రియా కూడా ఆర్మీ ఆఫీసర్ డ్రెస్‌లో కనిపించింది. ఇదే సందర్భంలో కమల్ ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ కూడా అభిమానులకు షేర్ చేశాడు. విశ్వరూపం-2 షూటింగ్ ఫైనల్ స్టేజీలో వుంది. ఇందులో భాగంగా చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో మహిళా అధికారులకు శిక్షణ ఇస్తున్నారు. మహిళలకు ముఖ్యంగా నా భారతమాతకు సెల్యూట్ చేస్తున్నా. మా తుఝే సలామ్ అంటూ ట్వీట్ చేశాడు. రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై కమల్‌హాసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.