15న లవర్ ఆఫ్ ఇడియెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీన్ చంద్ర, నివేదా థామస్ జంటగా అనురాగ్ ప్రొడక్షన్స్ పతాకంపై అజయ్ వద్దిరాల దర్శకత్వంలో రఘుబాబు చౌదరి, కె.పి.చౌదరి సంయుక్తం గా రూపొందిస్తున్న చిత్రం ‘జూలియట్ లవర్ ఆఫ్ ఇడియెట్’. ఈ చిత్రం ఈమధ్య సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 15న భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది. దర్శక నిర్మాతలు మాట్లాడుతూ- మ్యూజికల్‌గా భారీ హిట్ అందుకున్న ఈ చిత్రం అభిమానుల్లో మంచి అంచనాలు పెం చిందని, అలీ, అభిమన్యుసింగ్, తా.రమేష్, జీవా, సుప్రీత్, గిరి, దేవన్, శ్రవ ణ్, రోహిణి వంటి భారీ తారాగణంతో లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించామని తెలిపారు. వరుస హిట్‌లతో ఫామ్‌లో వున్న నివేదా థామస్ నటన, క్రేజ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని వారు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం:రతీష్ వేగా, కెమెరా:గిరీష్ గంగాధరన్, ఆథర్ విల్సన్, ఎడిటింగ్:ఎస్.బి.ఉద్ధవ్, దర్శకత్వం:అజయ్ వద్దిరాల.