ప్రేమకై ‘్ఛలో..’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగశౌర్య, రష్మిక జంటగా ఐరా క్రియేషన్స్ పతాకంపై వెంకి కుడుముల దర్శకత్వంలో ఉషా మూల్పూరి, శంకర్ ప్రసాద్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘్ఛలో’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా కథానాయకుడు నాగశౌర్య మాట్లాడుతూ- ఇటీవల వైజాగ్‌లో ఓ పాటను విడుదల చేయగా యువతరంనుండి మంచి రెస్పాన్స్ వచ్చిందని, పాటలన్నీ సినిమాలో వైవిధ్యంగా చిత్రీకరించారని తెలిపారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ బోర్డర్‌లో జరిగే కాలేజీ ప్రేమకథగా ఈచిత్రాన్ని వెంకి రూపొందించారని, ప్రతి సన్నివేశం సినిమాలో హైలెట్‌గా వుండేలా స్క్రీన్‌ప్లేలో డిజైన్ చేశారని ఆయన అన్నారు. ఇటీవల విడుదల చేసిన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ లభిస్తోందని, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని ఆయన అన్నారు. టీజర్‌కు మంచి స్పందన వస్తోందని, రెండు గ్రామాలమధ్య జరిగే వైవిధ్యమైన కథనంతో ఈ చిత్రాన్ని రూపొందించామని, ఈనెల 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు ఉషా మూల్పూరి, శంకర ప్రసాద్ వివరించారు. ఈ చిత్రానికి సంగీతం: సాగర్ మహతి, కెమెరా: సాయిశ్రీరామ్, దర్శకత్వం: వెంకి కుడుముల.