వెంకీ సరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవసేనగా బాహుబలితో మరింత క్రేజ్ పెంచుకున్న అందాల భామ అను ష్క ప్రస్తుతం భాగమతి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జనవరి 26న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా అనుష్క వెంకటేష్ సరసన నటించేందుకు ఓకె చెప్పిందట. వెంకటేష్ కథానాయకుడిగా తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఆటా నాదే వేటా నాదే పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరని చర్చలు జరిగాయి. ముందుగా కాజల్ పేరు వినిపించింది. కాజల్ వేరే సినిమాలతో బిజీగా వుండడంతో అనుష్క పేరు పరిశీలనకు వచ్చింది. వెంకటేష్‌తో చింతకాయల రవి, నాగవల్లి చిత్రాలలో అనుష్క జోడీగా నటించింది. మరోసారి వెంకటేష్‌తో నటించడానికి సిద్ధమైంది. మరోవైపు నాగార్జున రాంగోపాల్‌వర్మ కాంబినేషన్ తెరకెక్కుతున్న సినిమాలో అనుష్క పేరు వినిపించింది. కానీ చివరికి అనుష్క నో చెప్పడంతో మరో ముంబయి భామను పరిచయం చేయనున్నారు.