నాకంటూ ఓ గోల్ ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమెడియన్‌గా దాదాపు 70 చిత్రాలు చేశా. ఇంకా లైఫ్‌లో కొత్తదనం ఏముంది? ఏ సినిమాలో చూసినా సప్తగిరి ఒకేలా వున్నాడు అని ప్రేక్షకులు అనుకోకుండా నాకంటూ ఓ గోల్‌ను పెట్టుకుని హీరో అయ్యాను. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మంచి కథలు ఎంపిక చేసుకుంటూ వస్తున్నాను. ఈ సినిమాతో మరింత విజయం సాధిస్తానన్న నమ్మకం వుంది అని నటుడు సప్తగిరి చెప్పారు. సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ పతాకంపై చరణ్ లక్కాకుల దర్శకత్వంలో డా.రవికిరణ్ రూపొందించిన చిత్రం ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా సినిమా హీరో సప్తగిరి విశేషాలు తెలిపారు.
అలా వుంటుంది
ఓ కామన్ మెన్ కథతో సందేశాత్మకంగా ఈ చిత్రం రూపొందింది. భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి సమానమైన హక్కు ఉండాలి. ప్రతి ఒక్కరికీ న్యాయం దక్కాలి అని పోరాడే ఓ చిన్న లాయర్ కథ ఇది. నీతి నిజాయితీతో మనసుకు హత్తుకునేలా అలా వుంటుంది.
అందుకే రీమేక్
మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా చేయాలన్న నా కోరిక ఈ సినిమాతో తీరింది. హిందీలో సూపర్‌హిట్ అయిన జాలీ ఎల్‌ఎల్‌బి కథలో మంచి బలమైన కంటెంట్ ఉంది. దానిని తీసుకుని తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో జోడించి ఈ సినిమా రూపొందించాము. నా ఆలోచనలకు తగిన విధంగా కెమెరామెన్ ఈ సినిమాను తీశాడు. ఈ సినిమాను లాయర్లకు అంకితం చేశాం.
స్క్రీన్‌పై చూస్తారు
చిత్రంలో చివరి 45 నిమిషాలు చాలా ఉత్కంఠగా వుంటుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురి అవుతారు. సప్తగిరి అనే కామెడీ నటుడిలో వున్న సెంటిమెంట్, ఎమోషన్ సన్నివేశాలు ఎలా చేశాననేది ప్రేక్షకులు స్క్రీన్‌పై చూస్తారు. నాకు తగిన విధంగా పరుచూరి బ్రదర్స్ మాటలు రాశారు. నాకు మెచ్యూరిటీ ఎంత వుందో తెరపై చూశాక మీరే చెప్పండి.
దర్శకుడు గురించి
చాలా సీనియర్ మోస్ట్ కోడైరెక్టర్ ఆయన. అనుకున్న సమయంలోనే సినిమా పూర్తవ్వాలన్న ఆలోచనతో ఆయన్ని తీసుకున్నాము. ఇప్పటికే ఇది రీమేక్ కనుక అవగాహన వున్న మంచి దర్శకుడు అయితే బాగుంటుందనుకున్నాం. అనేక ప్రొడక్షన్ సంస్థలలో చేసిన అనుభవం ఆయనకు వుంది. నేను అనుకున్న ఔట్‌పుట్ ఆయన కరెక్ట్‌గా ఇచ్చారు.
అన్ని సప్తగిరులేనా?
నా తొలి చిత్రానికి కాటమరాయుడు అన్న పేరు పెట్టాం. అది పవన్‌కళ్యాణ్ అడిగితే ఇచ్చేశాం. అసిస్టెంట్ డైరెక్టర్ సలహాతో సప్తగిరి ఎక్స్‌ప్రెస్ అని పేరుపెట్టాం. ఈ సినిమా కూడా అదే సెంటిమెంట్‌తో సప్తగిరి ఎల్‌ఎల్‌బి అని పెట్టాం. ఇంకా అనేకమంది తదుపరి చిత్రాలకు సప్తగిరి వెడ్స్ సన్నీలియోన్, సప్తగిరి దెయ్యం పట్టింది, సప్తగిరి బంగాళాఖాతం అంటూ రకరకాల టైటిల్స్ చెబుతున్నారు. సెంటిమెంట్ బాగా వుంది కనుక అలా ముందుకెళుతున్నా.
మేకింగ్ విలువలు
నిర్మాత రవికిరణ్ చేసిన తొలి సినిమా సూపర్‌హిట్ అయింది. ఆయన హ్యాపీ. మేం కూడా హ్యాపీ. ఈ సినిమాను కూడా ఆయన గ్రాండియర్‌గానే తీశారు. మా బావగా ఓ చిన్న పాత్రలో ఆయన నటించడం మరింత హ్యాపీ.
ముగ్గురం హీరోలం
సాయకుమార్ పాత్ర చాలా కీలకం. హిందీలో బొమన్ ఇరానీ చేసిన పాత్రను ఆయన చేశారు. ఓ వైపు సాయికుమార్, మరోవైపు శివప్రసాద్, నేను కలిసి ముగ్గురం హీరోలుగానే పోటా పోటీగా నటించాం.
నెక్స్ట్ మూవీస్
ఎక్కువగా రీమేక్‌లే వస్తున్నాయి. సినిమా బాగుంటే తప్పక చేస్తా. నేను బాగుండడమే కాదు నా నిర్మాత, దర్శకుడు కూడా బాగుండాలని కోరుకుంటా. అలా సేఫ్ జోన్‌లో వుండే సినిమాలే చేస్తా.