పడిపోయా నీ మాయలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరుణ్‌గుప్తా, సావేరి, జయవర్థన్ ప్రధాన తారాగణంగా శ్రీరాజన్నా మూవీస్, మహేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై ఆర్.కె.కాంపల్లి దర్శకత్వంలో మహేష్ పైడా, భరత్ అంకతి రూపొందించిన చిత్రం ‘పడిపోయా నీ మాయలో’. జయవర్థన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో సీడీని హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ విడుదల చేశారు. తొలి సీడీని ఎన్.శంకర్ అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ- తెలంగాణలో సినిమా రంగం కొన్ని కుటుంబాలకు పరిమితమైపోతున్న ఈ రోజుల్లో తెలంగాణ యువత సినిమా తీయడానికి ముందుకు రావడం గొప్ప పరిణామమని, హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ అంతరించిపోతుందని చాలామంది అన్నారని, ఇది అవాస్తవమని తెలంగాణ ప్రభుత్వం నిరూపించిందని తెలిపారు. కరీంనగర్ జిల్లా వాళ్లంతా కలిసి ఈ చిత్రాన్ని తీయడం అభినందనీయమని, ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆయన కోరుకున్నారు. కథానుగుణంగా ఈ టైటిల్ అయితేనే బాగుంటుందని నిర్ణయించామని, దర్శకుడు పూరి అంటే వున్న పిచ్చితోనే ఈ సినిమా డిజైన్ చేసుకున్నానని ఈ బ్యానర్‌లోనే రెండో సినిమా కూడా చేస్తానని, త్వరలో ఈ సినిమాను విడుదల చేయనున్నామని దర్శకుడు ఆర్.కె.కాంపల్లి తెలిపారు. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చామని, వినోదాత్మక ప్రేమ కథా చిత్రంగా వరంగల్, ఖమ్మం, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేశామని నిర్మాతలు తెలిపారు. కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్.శంకర్, ప్రతాని రామకృష్ణగౌడ్, సంగీత దర్శకుడు జయవర్థన్ తెలిపారు. ఎంఎల్‌ఏ విద్యాసాగర్, రాజ్ కందుకూరి తదితరులు పాల్గొని విశేషాలు తెలిపారు. ఫణిందర్, రాధాకృష్ణ, భరత్, మల్లికార్జున్, రాధారపు ప్రభాకర్, పూర్ణచందర్, మల్లేశం, రమేష్ ఆరె తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు:నరేష్ చైతన్య, వీరు, కెమెరా:విక్రమ్ తలశిల, ఎడిటింగ్:గోపీ సింధం, నిర్మాతలు:మహేష్ పైడ, భరత్ అంకితి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఆర్.కె.కాంపల్లి.