అమ్మో..అలాగా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలకృష్ణతో రెండు చిత్రాల్లో నటించిన రాధికా ఆప్టే ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ‘కబాలి’ చిత్రంతో జోడీ కట్టిన ఎటువంటి అవకాశాలు రాలేదు. సినిమా విజయాల కన్నా వివాదాస్పద కామెంట్స్‌తోనే ఈ అమ్మడు పాపులర్ ఆయింది. మీడియాలో హల్‌చల్ కోసం సంచలన వ్యాఖ్యలు చేసిందో లేక లైంగిక వేధింపులు నిజంగానే ఎదుర్కోందో తెలియదుగానీ, మొత్తానికి ఆ వ్యాఖ్యలతోనే రాధికా ఆప్టే ఫేమస్ అయింది. తాజాగా మరోసారి ఇలాంటి వ్యాఖ్యానాలే చేసింది. చిత్రసీమలో కేవలం ఆడవారిపైనే లైంగిక వేధింపులు అంటే ఒప్పుకోననీ, ఈ చిట్టాలో మగవారు, చిన్నారులు కూడా వున్నారని సంచలనం రేపింది. మీరు ఇలా ఎన్నోసార్లు ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నారు కదా.. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారి పేర్లు చెబితే సరిపోతుంది కదా అని ప్రశ్నిస్తే- ‘‘అమ్మో.. అలాకూడా చేయగలమా? అలా చేస్తే అసలు మేము బతికి వుండగలమా?’’అంటూ ఎదురు ట్రీట్ వేసింది. మొత్తానికి తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను అని పరోక్షంగానే చెబుతోంది అన్నమాట!