ట్వింకిల్ ఆరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటేష్‌తో శీను చిత్రంలో కథానాయికగా నటించిన ట్వింకిల్‌ఖన్నా గుర్తుందికదా! రాజేష్‌ఖన్నా-డింపుల్ కపాడియా తనయగా గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు తెలుగులో ఒకే ఒక చిత్రంలో ఆగిపోయింది. అయితే బాలీవుడ్‌లో అవకాశాలు రావడంతో అక్కడ నటిగా నిరూపించుకుంది. ఆ తరువాత హీరో అక్షయ్‌కుమార్ పెళ్లిచేసుకోవడంతో కెమెరాకు దూరమైంది. ప్రస్తుతం ఆమె పుస్తకాల రచయిత్రిగా మారింది. ఇంతవరకూ బాగానే వుంది కానీ, పుస్తకాలమీద కూర్చుని ఓ మాగజైన్‌కు పోజ్ ఇవ్వడం, అది ఆ పత్రికలో రావడం బాలీవుడ్‌లో చర్చనీయాంశం అయింది. దీనిపై పుస్తక ప్రియులందరూ ట్వింకిల్ ఖన్నాపై దుమ్మెత్తిపోస్తున్నారు. పుస్తకాలపై వున్న మమకారం తనకు చాలా గొప్పదని, అయితే తన స్నేహితుల్లాంటి వాటిపై కూర్చోవడానికి, నిద్రపోవడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పుకొచ్చింది. పుస్తకాలు చదివితే విజ్ఞానం వస్తుంది, కానీ పూజిస్తే రాదు. కనుక పుస్తకాలు చదవండయ్య అంటూ ట్వీట్ పెట్టింది. నటిగా కంటే రచయిత్రిగానే మంచి గుర్తింపు కోసం ఆరాటపడుతోంది ఈ గుమ్మడు. మిసెస్ ఫన్నీ బోన్స్, ది లెజెండ్ ఆఫ్ లక్ష్మీప్రసాద్ లాంటి పుస్తకాలతో మంచి గుర్తింపు పొందింది.