సహజత్వానికి దగ్గరగా...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విడుదలైన ప్రతి కేంద్రంలో సినిమా బాగుందని వౌత్ టాక్ వచ్చింది. ముఖ్యంగా హిట్ టాక్ రావడం చాలా ఆనందంగా వుంది అని నిర్మాత డా.రవికిరణ్ అన్నారు. సప్తగిరి కథానాయకుడిగా సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకంపై చరణ్ లక్కాకుల దర్శకత్వంలో ఆయన రూపొందించిన సప్తగిరి ఎల్‌ఎల్‌బి విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రిమియర్ షో హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ఇలాంటి కథతో ఇమేజ్ లేని నటుడైతేనే బాగుంటుందని సప్తగిరితో రూపొందించామని, మాతృకలో ఫ్లేవర్‌ను కాపాడుకుంటూ తెలుగు నేటివిటికీ మార్చి చక్కగా చేశామని తెలిపారు. శివప్రసాద్, సాయికుమార్, సప్తగిరి ముగ్గురు కలిసి మూడు పిల్లర్స్‌లా ఈ సినిమా కోసం కష్టపడ్డారని, భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి సందేశం వున్న చిత్రాలనే తాను రూపొందిస్తానని ఆయన అన్నారు. తాను ఈ చిత్రంలో యాదృచ్ఛికంగానే నటించానని, అయితే భవిష్యత్తులో నటిస్తానా లేదా అనేది ఇపుడు చెప్పలేనని తెలిపారు. చిన్నప్పుడు స్టేజీ ఆర్టిస్టుగా అనుభవం వుండడంతో ఇపుడు పనికివచ్చిందని, కథ డిమాండ్ చేస్తే మూడో సినిమా కూడా సప్తగిరితోనే చేయడానికి సిద్ధమని ఆయన అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పెరిగిన నేను రైతుల ఆత్మహత్యలను చూసి బాధపడ్డానని, కాబట్టి వారి సమస్యలను ఈ సినిమా ద్వారా తెరకెక్కించాలని చేశానని అన్నారు. ఫిదా తరువాత తెలంగాణలో అందమైన లొకేషన్లు వున్న పల్లెటూరుని సప్తగిరిలోనే చూపించామని వివరించారు.