హిందీలోనైనా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాని కథానాయకుడిగా అప్పట్లోవచ్చిన ‘ఆహా కళ్యాణం’లో నటించిన వాణీకపూర్ గుర్తుందా? ఆ ఒక్క సినిమాతోనే వాణి వెళ్లిపోయింది. ఆ తరువాత బాలీవుడ్‌లో కొన్ని చిత్రాల్లో కనిపించినా సరైన మార్కెట్ రాలేదు. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌తో నిర్మిస్తున్న ఓ చిత్రంలో ప్రస్తుతం ఆమెకు కథానాయికగా అవకాశం వచ్చింది. బేఫికర్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు చాలా రోజుల తరువాత మరో అవకాశాన్ని పట్టింది. ఈ చిత్రంలో టైగర్ ష్రాప్ కూడా నటిస్తున్నారట. అయితే ఈ సినిమాలో హీరోలిద్దరికీ ఎక్కువ ప్రాధాన్యత వున్నదట. హీరోయిన్‌గా కొత్తవాళ్లను తీసుకోవాలనుకున్నా వాణీకపూర్ సరిపోతుందని ఎంపిక చేసిందని సమాచారం. అయితే ఈ సినిమా కథ విన్నాక ఈ చిత్రంలో చేసినందువల్ల తనకు ఎంత గుర్తింపు వస్తుంది ఆలోచిస్దు వాణీకపూర్. ప్రస్తుతం ఈ సినిమాకు టైటిల్ ఇంకా నిర్ణయించలేదు. వచ్చే నెలలో ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు.