ప్రియాంకా.. మజాకా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పటికప్పుడు తన గ్లామర్‌తో బాలీవుడ్ టు హాలీవుడ్ వరకూ తన గ్లామర్‌ను చాటుతోంది ప్రియాంకా చోప్రా. ప్రస్తుతం ఆమె నటించిన రెండు హాలీవుడ్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా వున్నాయి. మకాం అంతా న్యూయార్క్‌లోనే సాగిస్తోంది. ఈమధ్య న్యూయార్క్‌లోనే ఇల్లు కూడా కొనేసింది. తాజాగా ప్రియాంకకు మరో అవకాశం వచ్చిందని బాలీవుడ్ మీడియా చెప్పుకుంటోంది. ఈనెలలో జరగబోయే ఓ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో నృత్యం చేయడానికి అవకాశం వచ్చిందట. కానీ ఇది పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ అలా అవార్డు కార్యక్రమంలో డాన్సులు చేసినందుకు ఆమెకు ముట్టే పారితోషికం ఎంతో తెలుసా. దాదాపు 12 కోట్లు అట. కేవలం 30 నిమిషాలపాటు డాన్సు చేసినందుకు ఈ ఆఫర్‌ను ఆ నిర్వాహకులు ఇస్తున్నారట. 30 నిమిషాల్లో 12 కోట్లు అంటే మాటలా మరి! అందుకే వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోకుండా సద్వినియోగం చేసుకుంది ప్రియాంక. దటీజ్ చోప్రా!