29న ‘2 కంట్రీస్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంకర్ స్వీయ దర్శకత్వంలో సునీల్ కథానాయకుడిగా మహాలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘2 కంట్రీస్’. మలయాళంలో సూపర్‌హిట్ అయిన ఈ చిత్రంలో మనీషారాజ్ కథానాయికగా నటించింది. సినిమా కోసం దర్శకుడు ఎన్.శంకర్ మరోసారి పాట రాయడం విశేషం. ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ- మలయాళంలో సూపర్‌హిట్ అవ్వడమేకాక రికార్డు స్థాయి వసూళ్లు దక్కించుకున్న ఈ చిత్రాన్ని రూపొందించామని, సునీల్‌కు సరిగ్గా సరిపోయే టైలర్‌మేడ్ పాత్ర ఇదని తెలిపారు. ఈ చిత్రంలో సునీల్‌ను సరికొత్తగా ప్రేక్షకులు చూస్తారని, అధిక శాతం అమెరికాలోనే షూటింగ్ చేసిన ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తిచేశామని ఆయన అన్నారు. పవన్‌కళ్యాణ్ విడుదల చేసిన టీజర్‌కు మంచి ఆదరణ లభిస్తోందని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 29న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. నరేష్, శ్రీనివాసరెడ్డి, పృధ్వీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో షాయాజీ షిండే, పోసాని కృష్ణమురళి, రాజా రవీంద్ర, సిజ్జు, దేవ్‌గిల్, శివారెడ్డి, సంజన ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం:గోపీసుందర్, కెమెరా:రాంప్రసాద్.సి, మాటలు:శ్రీ్ధర్ శీపాన, నిర్మాణం, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఎన్.శంకర్.