జాహ్నవి వస్తోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదేకవీరుడితో జతకట్టిన అతిలోక సుందరి శ్రీదేవి అంటే ఇప్పటికే అభిమానులకు హార్ట్‌స్ట్రోకే! అలాంటి అతిలోక సుందరి తనయ జాహ్నవి సినీ రంగ ప్రవేశం గురించి గత ఐదు సంవత్సరాలుగా వార్తలు వినిపిస్తూనే వున్నాయి. ఇదుగో వస్తోంది, అదుగో వస్తోంది అంటూ చెబుతున్న మాటలే కానీ ఎక్కడా జాహ్నవి కెమెరా ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. శ్రీదేవి కూడా తాను ఇప్పుడే సినిమాలకి రాదంటూ చెప్పుకొచ్చింది. బోనీకపూర్ మంచి కథలకోసం చూస్తున్నామంటూ చెప్పుకొచ్చాడు. చివరికి ఏదీ ఫైనల్ కాలేదు. చివరికి మరాఠీలో విజయవంతమైన సైరత్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో షాహిద్‌కపూర్ సోదరుడు ఇషాన్ కట్టర్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. హీరోయిన్‌గా జాహ్నవి ఫైనలైజ్ అయింది. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రంతో జాహ్నవి తెరంగేట్రం చేస్తోంది. ఇప్పటికే ఆమె నటించిన మరో చిత్రం ‘్ధడక్’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ కూడా బయటికి వచ్చేసింది. ఏ సినిమా ముందు విడుదలవుతుందో వేచి చూడాల్సిందే!