సాక్షిచౌదరి ముఖ్యపాత్రలో ఏంటి రాజా యూత్ ఇలా వుంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాక్షిచౌదరి, పర్వీన్‌రాజ్, పోసాని కృష్ణమురళి ప్రధాన తారాగణంగా లార్డ్ శివ క్రియేషన్స్ పతాకంపై ఆదిశేష సాయిరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.ఎస్.సాయికృష్ణారెడ్డి రూపొందించిన చిత్రం ‘ఏంటి రాజా యూత్ ఇలా వుంది..’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెలలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాతలు, మరో నిర్మాత దిల్‌రాజును కలిసి తమ చిత్ర విశేషాలను వివరించారు. అనంతరం దిల్‌రాజు సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు శేషసాయిరెడ్డి మాట్లాడుతూ-యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రంలో నేటి సమాజంలో యువత అలోచనా ధోరణిని ప్రధానాంశంగా చర్చించామని, సాక్షి చౌదరి ముఖ్య పాత్రలో సాగే ఈ సినిమాలో యువతకు సందేశం వుంటుందని తెలిపారు. నేటి అమ్మాయిలు, అబ్బాయిలు ప్రేమను ఒక ఆట వస్తువుగా భావిస్తున్నారని, దానివల్ల వాళ్ల జీవితాల్లో ఎలాంటి పరిణామాలు, చెడు ఫలితాలు వస్తున్నాయో వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశామని తెలిపారు. అమ్మాయి అయినా, అబ్బాయి అయినా జీవితాంతం ఒకరి తోడుతోనే ఉండాలనే సందేశం వుంటుందని, వివాహానంతర సంబంధాలు కుటుంబాలు కూల్చివేస్తున్న నేపథ్యంలో చిత్ర కథ వుంటుందని ఆయన అన్నారు. త్వరలో ఆడియో విడుదల కార్యక్రమం జరిపి ఈనెలాఖరుకు సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని నిర్మాత తెలిపారు. నాగరాకేష్, ఇంద్ర, సంతోష్, పూజిత, అవంతిక, శ్రావణి, అక్షర, భరణి, అప్పారావు, గెటప్ శ్రీను తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: శంకర్, సంగీతం: కిషన్, ఎడిటింగ్: నందమూరి హరి, పాటలు: రామ్ పైడిశెట్టి, శ్రీగణేశ్, దర్శకత్వం: ఆదిశేష సాయిరెడ్డి.