21న నాని ‘ఎంసిఏ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాని, సాయి పల్లవి జంటగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్‌రాజు రూపొందించిన చిత్రం ఎంసిఏ. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేశారు. ఈనెల 21న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ- ఆగస్టులోనే ఈ చిత్రం డిసెంబర్ 21న విడుదల కానుందని ప్రకటించామని, ఈనెల 15న విడుదల చేయాలనుకున్నా కుదరకపోవడంతో 21న విడుదల చేయనున్నామని తెలిపారు. ఇప్పటికే తమ సంస్థనుండి ఐదు హిట్స్ వచ్చాయని, ఈ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ సాధించాలనుకుంటున్నామని, అందులో భాగంగా ఈనెల 21న ఈ సినిమా విడుదల చేయనున్నామని తెలిపారు. మధ్యతరగతి కుర్రాడికి కుటుంబ సభ్యులతో మంచి రిలేషన్ వుంటుందని, ఆ సంబంధాలపై అనేక సినిమాలు వచ్చాయి కానీ వదిన, మరిది మధ్య అనుబంధంపై సినిమాలు వచ్చి చాలాకాలమైందని, ఈ చిత్రంలో వదినగా భూమిక నటించిందని ఆయన తెలిపారు. మధ్యతరగతి కుటుంబ సభ్యులమధ్య అనుబంధాలు, డ్రామాలతోపాటుగా ఓ మంచి ప్రేమకథ కూడా చిత్రంలో వుంటుందని, విజయ్ వర్మ విలన్‌గా నటించారని అన్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులకు నచ్చేశాయని, ఈ నెల 11న ట్రైలర్‌ను, ఆడియోను విడుదల చేయనున్నామని ఆయన వివరించారు. ఈ చిత్రానికి దర్శకత్వం: శ్రీరామ్ వేణు.